KGF 2: ‘కేజీఎఫ్’ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే టీజర్..!
KGF 2 movie news: యశ్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీక్వెల్.. ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో.. కేజీఎఫ్ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండెన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యారు. దీంతో కేజీఎఫ్2పై అన్ని […]
KGF 2 movie news: యశ్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సీక్వెల్.. ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో.. కేజీఎఫ్ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండెన్‌తో పాటు టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యారు. దీంతో కేజీఎఫ్2పై అన్ని ఇండస్ట్రీల్లో రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ మధ్య వచ్చిన ఫస్ట్‌లుక్ కేజీఎఫ్ 2పై అంచనాలను మరింత పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీ టీజర్ గురించిన ఓ వార్త ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.
అదేంటంటే మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 21న కేజీఎఫ్ 2 టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అయితే మామూలుగా టీజర్‌ను యశ్ పుట్టినరోజు సందర్భంగా గత నెల 8న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన టీజర్ వాయిదా పడగా.. ఈసారి మాత్రం కచ్చితమని తెలుస్తోంది. అంతేకాదు అదే రోజు విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ సీక్వెల్‌ను మామూలుగా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చేయడంతో.. జూలై 30నే కేజీఎఫ్2 ను రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.