ఆ రోజు ‘మిల్కీ’ డబుల్ ట్రీట్ లేదట.!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘ఖామోషి’. ఈ సినిమాకి చక్రి తోలేటి దర్శకుడు. కాగా ఈ చిత్రాన్ని మొదట మే 31న విడుదల చేయాలని నిర్మాతలు భావించినా.. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా టైం పడుతుండటంతో జూన్ 14కు వాయిదా వేసినట్లు ప్రకటించారు. సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాట, వినికిడి లోపం ఉన్న పాత్రలో నటిస్తుండగా.. ప్రభుదేవా సైకో పాత్రలో నటించారు. ఇకపోతే ప్రభుదేవా, తమన్నా జంటగా […]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం ‘ఖామోషి’. ఈ సినిమాకి చక్రి తోలేటి దర్శకుడు. కాగా ఈ చిత్రాన్ని మొదట మే 31న విడుదల చేయాలని నిర్మాతలు భావించినా.. గ్రాఫిక్స్ వర్క్ ఇంకా టైం పడుతుండటంతో జూన్ 14కు వాయిదా వేసినట్లు ప్రకటించారు.
సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాట, వినికిడి లోపం ఉన్న పాత్రలో నటిస్తుండగా.. ప్రభుదేవా సైకో పాత్రలో నటించారు. ఇకపోతే ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన ‘అభినేత్రి 2’ సినిమా మే 31న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. దీనితో ఆ రోజు మిల్కీ డబుల్ ట్రీట్ లేకపోవడంతో తమన్నా అభిమానులు నిరాశ చెందారు.




