‘అర్జున్ సురవరం’ అసలు ఏమయ్యాడు.?
యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటే.. కొన్ని కారణాల వల్ల అది కాస్తా మే 17కు వాయిదా పడింది. అయితే నిర్మాతలు ప్రకటించిన ఆ తేదీన కూడా సినిమా విడుదల కాలేదు. కాగా రెండుసార్లు ప్రకటించిన డేట్‌కు సినిమా రిలీజ్ కాకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్ధిక సమస్యలు […]
యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటే.. కొన్ని కారణాల వల్ల అది కాస్తా మే 17కు వాయిదా పడింది. అయితే నిర్మాతలు ప్రకటించిన ఆ తేదీన కూడా సినిమా విడుదల కాలేదు.
కాగా రెండుసార్లు ప్రకటించిన డేట్‌కు సినిమా రిలీజ్ కాకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్ధిక సమస్యలు ఉండడం వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదని కొందరు చెబుతుంటే.. సోలో రిలీజ్ డేట్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారని మరికొందరి వాదన. మరి ఈ రెండింట్లో ఏది నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
మరోవైపు ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. నిర్మాతలు విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో అని ఎదురు చూడడం తప్ప హీరో నిఖిల్ కూడా ఏమి చేయలేకపోతున్నాడు.