‘సైరా’ వచ్చేది అప్పుడేనా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చారిత్రాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మొదట ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకున్న చిత్ర యూనిట్ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అమితాబ్ బచ్చన్, కిచ్చ […]

  • Ravi Kiran
  • Publish Date - 7:47 pm, Thu, 16 May 19
'సైరా' వచ్చేది అప్పుడేనా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చారిత్రాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని మొదట ఆగష్టు 15న రిలీజ్ చేయాలనుకున్న చిత్ర యూనిట్ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.

అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.