సుశాంత్ కాల్ డిటైల్స్: వెలుగులోకి కీలక విషయాలు
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బీహార్ ప్రభుత్వ విఙ్ఞప్తి మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది
Sushant Case Updates:బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బీహార్ ప్రభుత్వ విఙ్ఞప్తి మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో సుశాంత్ కాల్ డిటైల్స్ సమాచారం విడుదల అయ్యింది. ఆ లిస్ట్ ప్రకారం నటుడి మాజీ మేనేజర్ దిశ సలైన్ మరణం తరువాత జూన్ 8 నుంచి 14 వరకు సుశాంత్, రియా మధ్య ఎలాంటి కాల్స్ గానీ మెసేజ్‌లు గానీ లేనట్లుగా తెలుస్తోంది.
అలాగే జనవరి 20 నుంచి 25 మధ్య సుశాంత్ హర్యానాలో తన సోదరి దగ్గర ఉండగా.. ఆ సమయంలో వీరిద్దరి మధ్య 20 కాల్స్ ఉన్నాయి. అయితే సుశాంత్ చనిపోయిన సమయంలో చివరిసారిగా రియాకు ఫోన్ చేశారని, ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. కాల్ లిస్ట్‌లో ఆరు రోజులుగా వారిద్దరి మధ్య ఎలాంటి కాల్స్ లేకపోవడం గమనర్హం. ఇదిలా ఉంటే సుశాంత్ ఆత్మహత్య కేసును ఓ వైపు ముంబయి పోలీసులు, మరోవైపు బీహార్ పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును సీబీఐ చేపట్టనుంది.
Read This Story Also: Breaking: కరోనాతో టీటీడీ అర్చకులు మృతి