‘క‌రాబు’ సాంగ్‌ను విడుదల చేసిన పొగరు టీమ్..

మనసుకు నచ్చిన ముద్దుగుమ్మను తన లవ్ లో పడేసేందుకు ఒక్కో చిత్రంలో ఒక్కోలా హీరో జిమ్ముక్కులు చేస్తుంటారు. ర‌ష్మిక మంద‌న్నా, ధ్రువ సార్జా కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం...

  • Sanjay Kasula
  • Publish Date - 5:49 pm, Thu, 6 August 20
'క‌రాబు' సాంగ్‌ను విడుదల చేసిన పొగరు టీమ్..

Pogaru First Song Karabu is Out : మనసుకు నచ్చిన ముద్దుగుమ్మను తన లవ్ లో పడేసేందుకు ఒక్కో చిత్రంలో ఒక్కోలా హీరో జిమ్ముక్కులు చేస్తుంటారు. ర‌ష్మిక మంద‌న్నా, ధ్రువ సార్జా కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం పొగ‌రు. ఈ చిత్రంలో కాలేజీ అమ్మాయిగా రష్మికను టీజ్ చేస్తూ సాగే సాంగ్ అదిరిపోయేలా చూపించారు డైరెక్ట‌ర్ నంద‌కిశోర్.

ఈ చిత్రం నుంచి తొలి వీడియో సాంగ్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ‘అరే ఎవ‌ర్రా ఈ గులాబ్ జామూన్‌.. ఏయ్ తెల్వ‌దా అన్న గ‌ర్ల్ ఫ్రెండ్ బే .. అనే సంభాష‌ణ‌ల‌తో మొదలై ‘క‌రాబూ’ అంటూ సాగే వీడియో సాంగ్ అంద‌రినీ అల‌రిస్తోంది. ధ్రువ సార్జా ఈ పాట‌లో మాస్ లుక్ అదరగొట్టాడు. చుట్టూ గుండాలతో ర‌ష్మిక‌ను టీజ్ చేస్తుండ‌టం కొత్తగా ఉంది. ఇందులో ధ్రువ త‌న డ్యాన్స్ తో అదర‌గొడుతున్నాడు.