సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందళన మొదలైంది. కృష్ణ పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు.. కృష్ణ కోసం పూజలు మొదలుపెట్టారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలనీ.. పూజలు చేస్తూ దేవుళ్లను వేడుకుంటున్నారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆరా తీశారు. కాంటినెంటల్ ఆసుపత్రి ఎండీని అడిగి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నట్లు గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ మేరకు తమిళి సై ట్విటర్‌లో సోమవారం రాత్రి పోస్టు చేశారు.
‘‘తెలుగు సూపర్ స్టార్ జి.కృష్ణ గారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆందోళన చెందాను. పుదుచ్చేరి నుంచి డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఎండి కాంటినెంటల్ ఆసుపత్రిని సంప్రదించి విచారించాను. ఈ సమయంలో అతని కుటుంబ సభ్యులు, అభిమానులు & శ్రేయోభిలాషులకు మేము అండగా ఉంటాము.’’ అంటూ ట్వీట్ చేశారు.
Concerned to know about the health condition of Telugu super star Shri.G.Krishna garu.
Now from #Puducherry
contacted Dr. Guru N Reddy MD Continental Hospital and enquired.
At this hour of stress we will stand with his family members, fans & well wishers.@urstrulyMahesh— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 14, 2022
ఇదిలాఉంటే.. కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ సహా 8 మంది వైద్య నిపుణులు కృష్ణను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపాయి. కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆసుపత్రి సోమవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కృష్ణ ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉన్నారని.. పలు అవయవాలు దెబ్బతిన్నాయని పేర్కొంంది. కృష్ణ కుటుంబ సభ్యుల సమక్షంలో వైద్యం చేస్తున్నామని.. రాబోయే 24- 48 గంటలు కీలకమని పేర్కొంది.
కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు మరో బులిటెన్ విడుదల చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆదివారం అర్ధరాత్రి కృష్ణకు గుండెపోటు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
మరిన్ని టాలీవుడ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.