AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: హమీదాను అనుకరించి శ్రీరామ్‌ను ఆటపట్టించిన సన్నీ.. మళ్లీ సిరిపై విరుచుకుపడిన షణ్ముఖ్‌..

బిగ్‏బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. సింగర్‌ శ్రీరామచంద్ర ఫినాలేకు అర్హత సాధించగా ఇతర కంటెస్టెంట్లు పోటాపోటీగా టాస్క్‌లను ఆడుతున్నారు. కాగా బుధవారం ఎపిసోడ్‌లో హస్‌మేట్స్‌కు సూపర్‌ లగ్జరీ టాస్క్‌తో పాటు '

Bigg Boss 5 Telugu: హమీదాను అనుకరించి శ్రీరామ్‌ను ఆటపట్టించిన సన్నీ.. మళ్లీ సిరిపై విరుచుకుపడిన  షణ్ముఖ్‌..
Bigg Boss
Basha Shek
|

Updated on: Dec 08, 2021 | 4:14 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 5 ముగింపు దశకు చేరుకుంది. సింగర్‌ శ్రీరామచంద్ర ఫినాలేకు అర్హత సాధించగా ఇతర కంటెస్టెంట్లు పోటాపోటీగా టాస్క్‌లను ఆడుతున్నారు. కాగా బుధవారం ఎపిసోడ్‌లో హస్‌మేట్స్‌కు సూపర్‌ లగ్జరీ టాస్క్‌తో పాటు ‘రోల్‌ ప్లే’ గేమ్‌ని ఆడాల్సిఉంటుంది. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటినుంచి బయటకు వెళ్లిపోయిన తోటి కంటెస్టెంట్ల పాత్రలను అనుకరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రియాంక పాత్రను పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా సన్నీ కూడా పింకీ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో ఇంటి సభ్యులందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఆతర్వాత మరో ఎలిమినేట్‌ కంటెస్టెంట్‌ హమీదాను కూడా అనుకరించే ప్రయత్నం చేశాడు. హౌస్‌లో ఆమెతో సన్నిహితంగా మెలిగిన శ్రీరామచంద్ర దగ్గరకు వెళ్లి ‘ హాయ్‌.. శ్రీరామ్ ఎలా ఉంది నీకు?’ అని అడిగాడు. దీంతో ‘ప్లీజ్‌రా బాబూ..నీకు దండం పెడతా’ అని శ్రీరామ్‌ అనడంతో కంటెస్టెంట్లందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఇక హౌస్‌లో సన్నిహితంగా ఉంటూ కలిసి మెలసి టాస్క్‌లు ఆడుతున్న సిరి- షణ్ముఖ్‌ల మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. ‘ఇతరులకు ఇచ్చిన గౌరవం ఫ్రెండ్స్‌కు ఇవ్వవు. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్‌’ అంటూ సిరిపై విరుచుకు పడ్డారు షణ్ముఖ్‌. ‘నువ్వు ఎవరికో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయితే నేనే ఆపాను. ఎవరో నిన్ను అప్పడమంటే నేను ఎదురుతిరిగి మాట్లాడాను. మీ అమ్మ వచ్చి అందరి ముందు మన గురించి, మన హగ్గుల గురించి మాట్లాడి నన్ను బాగా ఇబ్బంది పెట్టింది. నీ విషయంలో మొత్తం నెగెటివ్‌ నాపైనే వస్తోంది. నా నుంచి దూరంగా వెళ్లిపో. ఇప్పటి నుంచి మిగతా హౌస్‌మేట్స్‌ ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే’ అని షణ్ణు అనడంతో సిరి చిన్నబుచ్చుకుంది.

Also Read:

RRR Movie: ‘బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్’.. వేటాడటానికి సిద్ధంగా ఉన్న భీమ్..

Akhanda in OTT: బాలయ్య స్పీడుకు బ్రేకుల్లేవ్.. ఓటీటీలోకి అఖండ.. విడుదలయ్యేది ఎప్పుడంటే..

Janhvi Kapoor: దివి నుండి దింగివచ్చిన దేవకన్యలా మెరిసిన జాన్వీ

Follow Us