Cinema : ఓటీటీలోకి వచ్చేసిన రూ.460 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ.. ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించే సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ప్రతిష్టాత్మక వార్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 20, 2026 నుండి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ బ్లాక్ బస్టర్ హిట్ ఏంటో తెలుసా..

ఓటీటీలోకి ఈరోజు కొత్త కొత్త జానర్ చిత్రాలు వచ్చేశాయి. క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్, హారర్ సినిమాలు ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ విడుదలైంది. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన భారీ వార్ డ్రామా ‘బోర్డర్ 2’ ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. 1997లో విడుదలైన క్లాసిక్ ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 23న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దాదాపు రెండు నెలల థియేట్రికల్ రన్ తర్వాత, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో మార్చి 20, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
డైరెక్టర్ అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1971 భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో సాగుతుంది. మొదటి భాగం కేవలం లాంగేవాలా యుద్ధంపై దృష్టి పెట్టగా, ఈ సీక్వెల్ భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసిన సంయుక్త ఆపరేషన్లను అద్భుతంగా ఆవిష్కరించింది. సన్నీ డియోల్ ‘లెఫ్టినెంట్ కల్నల్ ఫతే సింగ్ కాలేర్’ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకోగా, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి కీలక పాత్రల్లో మెరిశారు. దాదాపు రూ.275 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన వార్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. దేశభక్తిని ప్రేరేపించే డైలాగులు, భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలలో ఒక ప్రత్యేకమైన వీడియోను షేర్ చేస్తూ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇచ్చింది. “చిన్న నాటి జ్ఞాపకం ‘సందేశే ఆతే హై’ పాటతో కూడిన ఒక లెటర్ (Chitthi) ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది” అంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు నేటి నుండి నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు.. మరీ ముఖ్యంగా దిల్జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..
