A1 Express Movie Trailer : హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్.. ఆకట్టుకుంటున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ ట్రైలర్
యంగ్ హీరో సందీప్ కిషన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా కాలం తర్వాత నిన్నువీడని నీడను నేనే సినిమా తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆతర్వాత తెనాలి రామకృష్ణ సినిమాతో మళ్లీ..
A1 Express Movie Trailer : యంగ్ హీరో సందీప్ కిషన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. చాలా కాలం తర్వాత నిన్నువీడని నీడను నేనే సినిమా తో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో ఆతర్వాత తెనాలి రామకృష్ణ సినిమాతో మళ్లీ ఫ్లాప్ ను అందుకున్నాడు. అయితే ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసి తో ఉన్న సందీప్ త్వరలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సందీప్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సందీప్ సిక్స్ ప్యాక్ ని ట్రై చేస్తున్నాడు. సౌత్ ఇండియాలోనే హాకీ క్రీడా నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం.
తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.. ‘మన దేశంలో స్పోర్ట్స్ మ్యాన్ కి ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ కూడా దొరకడం లేదు.. ఇక్కడ స్పోర్ట్స్ బిజినెస్ అయి చాలా కాలం అయింది.. ఏ స్పోర్ట్స్ చూడాలో ఏ స్పోర్ట్స్ చూడకూడదో బిజినెస్ మ్యానే డిసైడ్ చేస్తున్నాడు’ అని సందీప్ కిషన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. దీనికి హిప్ హాప్ తమిజ అందించిన నేపథ్య సంగీతం అలరిస్తుంది. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇక ఈ సినిమాలతో పాటు నరగసూరన్, కచడతపర అనే రెండు తమిళ సినిమాలలోను సందీప్ నటిస్తున్నాడు .