AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కపటధారి’ థీమ్ ట్రైలర్ రిలీజ్.. ఓ మ‌నిషి నిజాన్ని బ‌తికించ‌డానికి స‌మరమే అంటున్న సుమంత్…

అక్కినేని సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కపటధారి'. ఈ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తుండగా..

'కపటధారి' థీమ్ ట్రైలర్ రిలీజ్.. ఓ మ‌నిషి నిజాన్ని బ‌తికించ‌డానికి స‌మరమే అంటున్న సుమంత్...
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2021 | 8:20 PM

Share

Kapatadhaari Movie Theme Trailer: అక్కినేని సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కపటధారి’. ఈ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తుండగా.. క్రియేటివ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కావలధారి’ సినిమాకు రీమేక్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్లు సినిమపై ఆసక్తిని కలిగించాయి. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థీమ్ ట్రైలర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్.

థీమ్ ట్రైలర్ చూస్తుంటే.. ఆర్కియాలజీలో ఎప్పుడో జరిగిన హత్య, హంతకుడు ఎవరో తెలియదు. పోలీస్ డిపార్ట్ మెంట్‏కు అంతుచిక్కని ఆ రహస్యాన్ని ఓ ట్రాఫిక్ పోలీస్ ఎలా చేధించాడనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ మనిషి నిజాన్ని బతికించడానికి సమరం చేయాలి అని చెప్పే మాంటేజ్ సాంగ్ ఈ థీమ్ ట్రైలర్లో ఆకట్టుకుంటుంది. హంతుకుడిని రహస్యాంగా ఉంచుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఈ మూవీకి సైమ‌న్ కె.కింగ్ సంగీతం అందిస్తున్నారు. నాజర్‌, సంపత్‌, జయప్రకాశ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Also Read:

Kalyan Ram’s new Movie Photos: కల్యాణ్​రామ్​ కొత్త సినిమా..కొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న కళ్యాణ్ రామ్.

Follow Us