రౌడీతో లేడి సూపర్ స్టార్..?

వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఈయన గురించి తమిళ సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే విజయ్ దేవరకొండ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటించబోతోందట. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఇక ఈ న్యూస్ తెలుగు మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు తన సొంత బ్యానర్ డ్రీం వారియర్ పిక్చర్స్ […]

  • Ravi Kiran
  • Publish Date - 5:49 pm, Mon, 18 March 19
రౌడీతో లేడి సూపర్ స్టార్..?

వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తాజాగా ఈయన గురించి తమిళ సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే విజయ్ దేవరకొండ సరసన లేడి సూపర్ స్టార్ నయనతార నటించబోతోందట. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. ఇక ఈ న్యూస్ తెలుగు మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్. ప్రభు తన సొంత బ్యానర్ డ్రీం వారియర్ పిక్చర్స్ మీద ఓ నూతన దర్శకుడితో విజయ్ దేవరకొండ – నయనతారల సినిమాను తెలుగు, తమిళ భాషాల్లో నిర్మించనున్నట్లు వినికిడి. కథ ప్రకారం నయనతార అయితేనే ఆ పాత్రకు సూట్ అవుతుందని తెలుస్తోంది. కాగా ఈ జోడితో ఒక సినిమా రాబోతోంది అనేసరికి నెటిజన్లలో ఆసక్తి పెరిగింది. ఇంకా దీనిపై మాత్రం ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు.