సోనూ సాయాన్ని ప్రశ్నించిన నెటిజన్.. సాక్ష్యం చూపించిన నటుడు

కరోనా లాక్‌డౌన్ వేళ లక్షలాది మందికి నటుడు సోనూసూద్ దేవుడిలా మారారు. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులను తమ తమ స్వగ్రామాలను పంపడంలో సోనూ టీమ్‌ చాలా సాయం చేసింది

సోనూ సాయాన్ని ప్రశ్నించిన నెటిజన్.. సాక్ష్యం చూపించిన నటుడు
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 26, 2020 | 12:14 PM

Sonu Sood News: కరోనా లాక్‌డౌన్ వేళ లక్షలాది మందికి నటుడు సోనూసూద్ దేవుడిలా మారారు. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులను తమ తమ స్వగ్రామాలను పంపడంలో సోనూ టీమ్‌ చాలా సాయం చేసింది. ఇక ఆయన చేసిన సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సోనూకు ప్రత్యేక అవార్డును కూడా ప్రధానం చేసింది. అయితే ఇంత చేసినా.. ఆ నటుడిని విమర్శించే వారు లేకపోలేరు. వేరే వారు చేసిన సాయాన్ని కూడా సోనూ తన ఖాతాలో వేసుకుంటున్నారని పలువురు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు. దానికి స్పందించిన ఆయన.. నన్ను ట్రోల్ చేసే బదులు కుదిరితే మీరూ సాయం చేయండి. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా అలాంటి ఆరోపణలను మరోసారి ఎదుర్కొన్నారు సోనూ. ఇటీవల స్నేహల్ మైసల్ అనే ఓ నెటిజన్‌.. తన కుమారుడు పల్మొనరీ స్టెనోసిస్‌తో బాధపడుతున్నాడని, అతడికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సాయం చేసి ఈ పరిస్థితి నుంచి గట్టెంక్కించాలని కోరారు. దానికి స్పందించిన సోనూ.. ”రేపు మీ కుమారుడిని ఎస్‌ఆర్‌సీసీ ఆసుపత్రిలో చేర్చండి. ఒక వారంలో సర్జరీ జరుగుతుంది” అని కామెంట్ పెట్టారు.

అయితే దానికి రిషి భగ్రీ అనే మరో నెటిజన్.. ”కొత్త ట్విట్టర్ అకౌంట్‌, ఇద్దరు-ముగ్గురు ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఒకే ఒక్క ట్వీట్ వేశాడు. కనీసం సోనూను ట్యాగ్‌ కూడా చేయలేదు. లొకేషన్ చెప్పలేదు. కాంటాక్ట్ డిటైల్స్ కూడా ఇవ్వలేదు. ఈమెయిల్‌ అడ్రస్ కూడా లేదు. కానీ ఈ ట్వీట్‌ని సోనూ ఎలాగోలా కనుక్కొని సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. సాయం కావాలంటూ గతంలో సోనూను కోరిన వారు ఇప్పుడు ట్వీట్‌లను డిలీట్ చేశారు. సోనూ పీఆర్ టీమ్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఇది ఒక ఉదాహరణ” అని కామెంట్ పెట్టారు.

దానికి స్పందించిన సోనూ.. ”ఇబ్బందుల్లో ఉన్న వారిని నేను కనుగొంటాను, వారు నన్ను ఆశ్రయిస్తారు. ఇవి నీకు అర్థం కావులే. రేపు పిల్లాడు ఆసుపత్రిలో ఉంటాడు. నీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయి. అతడికి ఏవైనా కొన్ని పండ్లు పంపు. తన ఫాలోవర్ల నుంచి ప్రేమ లభించిందని.. ఆ 2-3 ఫాలోవర్లు ఉన్న వ్యక్తి సంతోషిస్తాడు” అని కామెంట్‌ పెట్టారు. ఈ సందర్భంగా రోగి వివరాలను కూడా సోనూ సూద్ షేర్ చేశారు.

Read More:

పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

విషమంగా ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu