పైడితల్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సంచయిత

విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఇక జాతరలో భాగంగా మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్మన్ సంచయిత గజపతిరాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు

  • Manju Sandulo
  • Publish Date - 11:29 am, Mon, 26 October 20

Sanchaitha Gajapathiraju News: విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఇక జాతరలో భాగంగా మాన్సాస్ ట్రస్ట్‌ ఛైర్మన్ సంచయిత గజపతిరాజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళతాళాలు, పల్లకిలో పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి సంచయిత చేరుకోగా.. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంచయిత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆ తరువాత సంచయిత మాట్లాడుతూ.. ట్రస్ట్‌ ఛైర్మన్‌ హోదాలో తొలిసారి అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని.. ఆ అమ్మవారి చల్లని చూపులు, కరుణ కటాక్షలు అందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా పూర్తిగా తొలిగిపోయి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని తాను అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Read More:

విషమంగా ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం

నిహారికకు రీతూ, లావణ్య స్పెషల్ పార్టీ