విషమంగా ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం

దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన స్పృహలో లేరని

  • Manju Sandulo
  • Publish Date - 11:01 am, Mon, 26 October 20

Soumitra Chatterjee health: దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు సౌమిత్ర ఛటర్జీ ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన స్పృహలో లేరని, రక్తకణాల సంఖ్య గణనీయంగా పడిపోయిందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోయిందని, యూరియా, సోడియం స్థాయి బాగా పెరిగిందని పేర్కొన్నారు.

అయితే సౌమిత్ర ఊపిరితిత్తులు, గుండె బాగా పనిచేస్తున్నాయని, కానీ బ్రెయిన్‌ ఫంక్షనింగ్‌ సరిగా లేదని వైద్యులు వెల్లడించారు. ఆయన తదుపరి చికిత్స గురించి న్యూరాలజిస్ట్‌, నెఫ్రాలజిస్ట్‌ బోర్డు ఈరోజు సమావేశమై చర్చిస్తాయని తెలిపారు. సౌమిత్ర ఛటర్జీ కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తే, వెంటనే ట్రీట్‌మెంట్‌ ప్రారంభిస్తామని వైద్యులు చెబుతున్నారు.

సౌమిత్రను రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నామని, కానీ వయసురీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన కొన్నిసార్లు చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. కాగా కరోనా సోకడంతో ఈ నెల 6న సౌమిత్ర ఆసుపత్రిలో చేరారు. కోల్‌కతాలోని బెల్లే వ్యూ క్లినిక్‌లో ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.

Read More:

నిహారికకు రీతూ, లావణ్య స్పెషల్ పార్టీ

‘వంటలక్క’ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. తెలుగు మూవీలో పవర్‌ఫుల్‌ పాత్రలో దీప