శివాజీరాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: నరేశ్

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే విభేదాలు బయటకొస్తున్నాయి. ఎన్నికల్లో నరేశ్‌కి ప్రత్యర్థిగా నిలిచిన శివాజీ రాజా తమను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారని నరేశ్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి క‌ృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరేశ్ మాట్లాడుతూ పని చేసుకోనీయకుండా తమను వెనక్కి లాగుతున్నారని అన్నారు. పరిశ్రమలోని పెద్దల సలహా మేరకు ఈ నెల 22న […]

శివాజీరాజా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు: నరేశ్
Follow us

|

Updated on: Mar 16, 2019 | 7:56 PM

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే విభేదాలు బయటకొస్తున్నాయి. ఎన్నికల్లో నరేశ్‌కి ప్రత్యర్థిగా నిలిచిన శివాజీ రాజా తమను ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకుంటున్నారని నరేశ్ ఆరోపిస్తున్నారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి క‌ృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరేశ్ మాట్లాడుతూ పని చేసుకోనీయకుండా తమను వెనక్కి లాగుతున్నారని అన్నారు. పరిశ్రమలోని పెద్దల సలహా మేరకు ఈ నెల 22న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించుకున్నామని తెలిపారు. కానీ శివాజీరాజా తన పదవీ కాలం 31 వరకూ ఉందని.. అప్పటి వరకూ కుర్చీలో కూర్చోవడానికి వీల్లేదంటున్నారని నరేశ్ పేర్కొన్నారు. ఒకవేళ అలా కూర్చుంటే కోర్టుకు వెళతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నరేశ్ చెప్పారు.