Shreya Ghoshal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్.. సోష‌ల్ మీడియాలో పోస్ట్

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్ అమ్మ అయ్యారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా సామాజిక మాధ్య‌మాల‌...

Shreya Ghoshal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్.. సోష‌ల్ మీడియాలో పోస్ట్
Singer Shreya Ghoshal
Follow us
Ram Naramaneni

|

Updated on: May 22, 2021 | 8:14 PM

ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్ అమ్మ అయ్యారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా సామాజిక మాధ్య‌మాల‌ వేదికగా స్య‌యంగా తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న హ్యపీ మూమెంట్స్ తెలియ‌జేశారు.. ‘ఈ మధ్యాహ్నం మాకు మగ బిడ్డ పుట్టాడు. ఇలాంటి ఫీలింగ్ గ‌తంలో ఎప్పుడూ అనుభ‌వించ‌లేదు. ప్రస్తుతం నేను, నా భర్త శిలాదిత్య, నా ప్యామిలీ మొత్తం ప‌ట్ట‌రాని సంతోషంతో ఉన్నాం’ అంటూ ఆమె ఈ విషయాన్ని త‌న ఫాలోవ‌ర్స్‌తో పంచుకున్నారు. అలాగే తను ‘బిడ్డకు మీరందరు ఇచ్చే ఆశ్వీర్వాదాలకు థ్యాంక్స్’ అంటూ ఆమె రాసుకొచ్చారు.

కాగా శ్రేయా ఇటీవల బేబీ షవర్‌ కార్యక్రమానికి సంబంధించిన తన బేబీ బంప్‌ ఫొటోలను త‌న సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. అవి కాస్తా వెంట‌నే ఇంట‌ర్నెట్‌లో ట్రెండ్ అయ్యాయి. త్వరలోనే తాను అమ్మని కాబోతున్నానని, ప్రస్తుతం అమ్మ తనాన్ని ఆస్వాధిస్తున్నానంటూ శ్రేయా అప్పుడు భావోద్వేగంతో చెప్పారు. కాగా 2015, ఫిబ్రవరి 5న శ్రేయా తన ఫ్రెండ్ శైలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకుని.. దాంప‌త్య జీవితంలోకి అడుగుపెట్టారు. భాష‌తో సంబంధం లేకుండా ఆమె వేల పాట‌ల‌ను పాడారు. అదెంటో ఆమె ఏ పాట పాడినా అది సూప‌ర్ హిట్ అవుతుంది. ఇటీవలె తెలుగులో ‘ఉప్పెన’, ‘టక్‌ జగదీశ్‌’ సినిమాల్లో కూడా ఆమె త‌న గాత్రంలో మెస్మ‌రైజ్ చేశారు. కాగా బిడ్డ పుట్టడంతో ప‌లువురు ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు శ్రేయా ఘోషల్ కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ALso Read:  ఈ నెలాఖరులో ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ.. రికార్డులు బ్రేక్ చెయ్య‌డానికి వేయి క‌ళ్ల‌తో వెయిటింగ్

రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌..