AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen: ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ కు కనీసం పోటీనివ్వలేకపోయిన మాజీ విశ్వసుందరి..

పసిపిల్లల మనసుల్లో దేవుడుంటారు.. వాళ్ళను దగ్గరకు తీసుకుంటేనే అదొక డెఫినిషన్ ఇవ్వలేనంత గొప్ప అనుభూతి...! మిస్ యూనివర్స్ కిరీటం ధరించే ముందు మాజీ విశ్వసుందరి చెప్పిన..

Sushmita Sen:  ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ కు కనీసం పోటీనివ్వలేకపోయిన మాజీ విశ్వసుందరి..
Sushmita Sen
Rajeev Rayala
|

Updated on: May 22, 2021 | 8:23 PM

Share

Sushmita Sen:

పసిపిల్లల మనసుల్లో దేవుడుంటారు.. వాళ్ళను దగ్గరకు తీసుకుంటేనే అదొక డెఫినిషన్ ఇవ్వలేనంత గొప్ప అనుభూతి…! మిస్ యూనివర్స్ కిరీటం ధరించే ముందు మాజీ విశ్వసుందరి చెప్పిన ముత్యాల్లాంటి మాటలివి. అది జరిగి.. 27 ఏళ్ళు. ఇప్పటిక్కూడా తన మాటకు కట్టుబడే వున్నారు సుష్మిత. గత జ్ఞాపకాల్లో తేలిపోతున్నారు మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్. మీరు ప్రపంచాన్ని జయించి అప్పుడే 27 ఏళ్లయింది… ఇప్పటికీ అదే అందంతో మెరుస్తున్నారు అంటూ ఫాలోయర్లు ట్వీట్లు పెడుతుంటే.. మురిసిపోతున్నారామె. 1994లో ఇండియన్ గ్లామర్ ఇండస్ట్రీలో ఆమె ఒక సంచలనం. మిస్ యూనివర్స్ అయ్యి అవ్వగానే .. రారమ్మని పిలిచింది సినిమా ప్రపంచం.

మహేష్ భట్ తీసిన దస్తక్ మూవీ తర్వాత సౌత్ నుంచి తరచూ కాల్స్ వెళ్లాయి సుష్మితకు. నాగార్జున హీరోగా అప్పట్లో కేటీ కుంజుమోన్ చేసిన మల్టీలింగువల్ మూవీ రక్షకుడు.. సుష్మితను తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేసింది. తర్వాత కూడా ఆమె కెరీర్ గ్రాఫ్ సాఫీగా సాగలేదు. ఐశ్వర్య రాయ్ తో కనీసం పోటీనివ్వలేకపోయారు సుష్మితా సేన్. అడిసన్స్ అనే డిసీజ్ తో బాధపడుతున్న సుష్మిత.. జీవితాంతం స్టెరాయిడ్స్ వాడుతూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇద్దరు ఆడపిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళతో స్పెండ్ చేయడంలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. తనకంటే చాలా చిన్నవాడైన రోహ్మన్ షాల్ తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తల్ని ఎప్పుడూ ఖండించలేదు ఈ మాజీ మిస్ యూనివర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Director Sukumar: రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌..

Shreya Ghoshal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్.. సోష‌ల్ మీడియాలో పోస్ట్

Mahesh Babu Fans: ఈ నెలాఖరులో ఘట్టమనేని ఫ్యాన్స్ పండుగ.. రికార్డులు బ్రేక్ చెయ్య‌డానికి వేయి క‌ళ్ల‌తో వెయిటింగ్