పదేళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సింగర్ నేహా
పదేళ్ల వయస్సులోనే తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ప్రముఖ సింగర్ నేహా బాసిన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నేహా.. తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై షాకింగ్ విషయాలు వెల్లడించారు.
Singer Neha Bhasin: పదేళ్ల వయస్సులోనే తాను లైంగిక వేధింపులకు గురైనట్లు ప్రముఖ సింగర్ నేహా బాసిన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నేహా.. తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై షాకింగ్ విషయాలు వెల్లడించారు.
పదేళ్ల వయస్సులో నేను హరిద్వార్‌కి వెళ్లాను. అక్కడ మా అమ్మ నాకు కాస్త దూరంలో నిల్చోని ఉంది. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను అక్కడి నుంచి పారిపోయా. ఆ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత మరో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సంఘటనలు నాకు బాగా గుర్తున్నాయి. అది నా తప్పేమోనని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, మెంటల్‌గా చాలా మంది ఎదుటివాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఓ టెర్రరిజం లాంటిదే అని చెప్పుకొచ్చారు.
ఇక ”ఒకానొక సమయంలో కే-బ్యాండ్‌కి నేను పెద్ద అభిమానిని కాదు అని చెప్పినందుకు చాలా మంది నన్ను బెదిరించారు. నిన్ను చంపేస్తాము, రేప్ చేస్తాం అని ఆన్‌లైన్‌లో నాకు మెసేజ్‌లు వచ్చేవి. వాటితో అలానే ఉండాలని నేను అనుకోలేదు. అందుకే వారిపై ఫిర్యాదు చేశా. ఏ తప్పు లేకుండా ఎవ్వరూ శిక్ష అనుభవించకూడదు. తప్పు లేనప్పుడు వారి వాయిస్‌ని వినిపించాలి” అని చెప్పుకొచ్చారు. కాగా అటు నువ్వే ఇటు నువ్వే, స్వింగ్ జర, నిహారిక నిహారిక వంటి పాటలతో తెలుగు వారికి నేహా దగ్గరైన విషయం తెలిసిందే.