Kalyani Menon: ప్రముఖ నేపథ్య గాయని కళ్యాణి మీనన్ (80) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణి సోమవారం తుదిశ్వాస విడిచారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ తల్లి కళ్యాణి మీనన్. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన కళ్యాణి తెలుగు, తమిళం, మలయాలం భాషలలో ఏకంగా 100కి పైగా పాటలు పాడారు. 1979 తమిళ సినిమా నల్లతోరు కుటుంబం సినిమాకు ఇళయరాజా సంగీత సారథ్యంలో పాటలు ఆలపించారు. అలాగే కాధలన్, ముత్తు, అలైపాయుథే, విన్నైతంది వరువాయ, ఏక్ దీవానా థా వంటి చిత్రాలకు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో పలు పాటలను ఆలపించారు.
ఎర్నాకుళంలో జన్మించిన కళ్యాణి.. పదేళ్ల వయసులోనే పాటలు ప్రారంభించింది. సుజాత (1980), నీ వరువై ఎనా వంటి చిత్రాలలో పాటలు పాడింది. ఏఆర్ రెహమాన స్వరపరచిన వందేమాతరం ఆల్బమ్లోనూ కళ్యాణి పాడింది. 2000 లో, కళ్యాణి ఆమె కుమారుడు రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన కందుకొండెయిన్ కందుకొండేన్ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. 2010 లో ఆమె భక్తి సంగీతానికి చేసిన కృషికి తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, కేరళ సంగీత నాటక అకాడమీ అవార్డులు అందుకుంది. గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమ్యలతో బాధపడుతున్ కళ్యాణి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సోమవారం తుది శ్యాస విడిచారు. కళ్యాణి మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ .. తమిళ, మళయాళ చిత్ర పరిశ్రమ నివాళుర్పిస్తుంది. అలాగే ఏఆర్ రెహమాన్ తన ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అలాగే సింగర్ చిత్ర ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.
Heartfelt condolences on the passing away of the noted singer Kalyani Menon. May her soul rest in peace. ?#KalyaniMenon #KSChithra @DirRajivMenon pic.twitter.com/HnUz963brC
— K S Chithra (@KSChithra) August 2, 2021
Also Read: