Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే..
విడాకుల వార్తలపై గాయకుడు హేమచంద్ర మౌనం వీడారు. తన, శ్రావణ భార్గవి వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఊహాగానాలను ఆయన ఖండించారు. తప్పుడు యూట్యూబ్ థంబ్‌నైల్స్‌ను విమర్శిస్తూ, కుటుంబంపై వాటి ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. తన ADHD ఆల్బమ్ వింటే నిజం తెలుస్తుందని, అనవసరమైన చర్చలను ప్రోత్సహించవద్దని ఆయన సూచించారు.

ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై మీడియాలో జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తన, శ్రావణ భార్గవి విడాకులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని, అయితే తామిద్దరం ఎప్పుడూ దీనిపై బహిరంగంగా మాట్లాడలేదని హేమచంద్ర స్పష్టం చేశారు. ఈ చర్చను అనవసరంగా పొడిగించడం తన ఉద్దేశ్యం కాదని, అయినప్పటికీ ఇది సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించాలని తాను కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సృష్టించే సంచలనాత్మక థంబ్‌నైల్స్‌పై హేమచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన కుమార్తె తల్లిదండ్రులు తిరిగి కలవాలని వేడుకుంటున్నట్లు చిత్రీకరించిన ఒక వీడియో థంబ్‌నైల్‌ను ఉదహరిస్తూ, “మా ఇంట్లో ఎప్పుడూ జరగనిది నీకెలా తెలిసింది? ఏం పిచ్చి దొబ్బిందా?” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి క్రియేటివిటీని ఆయన ఒక విధంగా మెచ్చుకున్నప్పటికీ, కుటుంబంతో పంచుకోలేని, సిగ్గుపడే పనిని ఎవరూ చేయకూడదని హితవు పలికారు.
కళాకారులు వివాదాలకు ఏ విధంగా స్పందించాలనే దానిపై హేమచంద్ర తన సిద్ధాంతాన్ని పంచుకున్నారు. “ఒక కుట్రకు అనవసరంగా స్పష్టత ఎందుకు ఇస్తున్నారు?” అని ప్రశ్నించారు. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, దాన్ని వెంటనే పబ్లిక్ డొమైన్‌లో చర్చించకుండా, కొంత విరామం తీసుకుని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలని సూచించారు. కళాకారులు తమ బాధను వ్యక్తిగతంగా ప్రాసెస్ చేయాలని, అనవసరంగా మీడియాలో దానిని చర్చించి మరింత ప్రొలాంగ్ చేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రకమైన చర్చలు తమలాంటి సెలబ్రిటీలకే కాకుండా, పబ్లిక్ స్పేస్‌లో లేని వారి కుటుంబ సభ్యులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని హేమచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దలు, పిల్లలకు ఈ “గేమ్” తెలియదని, దాని వల్ల వారు అనవసరంగా బాధపడాల్సి వస్తుందని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే తన “ADHD” ఆల్బమ్‌ను వినాలని, అందులోని “యు ఆర్ మైన్” పాట తన భావోద్వేగాల ప్రవాహమని హేమచంద్ర సూచించారు. “ఒక తెలివైన వ్యక్తి అయితే ఆ ఆల్బమ్ వినగానే సమాధానం తెలుసుకుంటాడు” అని అన్నారు. అంతేకాకుండా, శ్రావణ భార్గవి అద్భుతమైన పాప్ మెటీరియల్ అని, ఆమె ఇంకా తన పూర్తి ప్రతిభను వెలికితీయలేదని హేమచంద్ర ప్రశంసించారు. ఆమె సామర్థ్యాలను ఇంకా చాలా మంది చూడలేదని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..
