షారూక్‌ ఇంటికి ‘ప్లాస్టిక్‌ మాస్క్’‌.. కరోనాకు భయపడి కాదట

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఖాన్‌ ముంబయిలోని తన ఇల్లు‌ 'మన్నాత్'‌ను ప్లాస్టిక్‌తో కప్పేశారు‌. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 5:01 pm, Tue, 21 July 20
షారూక్‌ ఇంటికి 'ప్లాస్టిక్‌ మాస్క్'‌.. కరోనాకు భయపడి కాదట

బాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్‌ ఖాన్‌ ముంబయిలోని తన ఇల్లు‌ ‘మన్నాత్’‌ను ప్లాస్టిక్‌తో కప్పేశారు‌. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ముంబయిలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. ఆ భయంతోనే షారూక్‌ ఇంటిని ఇలా కప్పేశాడంటూ కొంతమంది రాసుకొచ్చారు. కానీ షారూక్‌ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. జాగ్రత్త చర్యల్లో భాగంగానే షారూక్‌ ఇలా ప్లాస్టిక్‌తో తన ఇంటిని కప్పి ఉంచాడని తెలుస్తోంది. అయితే షారూక్‌ తన ఇంటిని ఇలా ప్లాస్టిక్‌తో కవర్ చేయడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ వర్షాకాలంలో కింగ్‌ఖాన్ తన ఇంటికి ప్లాస్టిక్‌ మాస్క్‌ వేశారు.