Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

|

Jan 20, 2022 | 5:51 AM

బాలీవుడ్‌  బాద్ షా షారుఖ్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి గాడ్ ఫాదర్ అండ లేకుండా బాలీవుడ్ లో

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..
Shah Rukh Khan
Follow us on

బాలీవుడ్‌  బాద్ షా షారుఖ్ ఖాన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి గాడ్ ఫాదర్ అండ లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టిన అతను తనదైన స్టైల్, యాక్టింగ్ తో ప్రపంచమంతటా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.  ఇక సోషల్ మీడియాలోనూ షారుఖ్ కు  భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.  ఇన్ స్టాగ్రామ్ లో  27 మిలియన్ల మందికి పైగా అతనిని అనుసరిస్తున్నారు. కాగా వ్యక్తిగతంగా గతేడాది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు షారుఖ్.   డ్రగ్స్ తీసుకున్నాడనే నెపంతో ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ అధికారులు అతని కుమారుడు ఆర్యన్ ఖాన్‌ని  అరెస్ట్ చేశారు.  మూడు వారాల  పాటు జైలులో కూడా గడిపాడు.  దీంతో అప్పటికప్పుడు తన సినిమాలన్నీ వాయిదా వేసుకున్నాడీ బాలీవుడ్ బాద్ షా. అంతేకాకుండా వ్యక్తిగత కారణాలతో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండిపోయాడు.

కుమారుడి అరెస్టుతో..

డ్రగ్స్ కేసు నుంచి ఆర్యన్ పూర్తిగా బయట పడిన తర్వాతే  కాస్త కుదుట పడ్డాడు షారుఖ్. వాయిదా వేసుకున్న తన సినిమా షూటింగులను మళ్లీ పట్టాలెక్కించాడు. అంతేకాకుండా సుమారు నాలుగు నెలల తర్వాత మొదటిసారిగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఓ కంపెనీకి సంబంధించిన ఎల్ఈడీ టీవీని ప్రమోట్ చేస్తూ ఓ వీడియో పెట్టాడీ సూపర్ స్టార్. కాగా ఈ పోస్ట్ చేసిన గంటలోపే 6 లక్షల వ్యూస్ రావడం విశేషం. చాలా కాలం తర్వాత  షారుఖ్ నెట్టింట్లో కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు సంతోషంగా ఫీలవుతున్నారు. ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే..2018లో ‘జీరో’ చిత్రంలో చివరిసారిగా కనిపించాడు షారుఖ్. ప్రస్తుతం అతను ‘పఠాన్’ సినిమాలో నటిస్తున్నాడు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, కండల వీరుడు జాన్ అబ్రహమ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

సూర్యనమస్కారంతో 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

మహిళల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష నల్ల ద్రాక్ష