బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొత్త చిత్రం ‘జవాన్’ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7న విడుదలవుతున్న ఈ సినిమా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. సినిమా విడుదలకు ముందే స్ట్రాంగ్ ట్రెండ్ క్రియేట్ అయ్యింది. ‘ జవాన్ ‘ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను చూస్తుంటే సినిమా భారీ కలెక్షన్లు రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక షారుఖ్ ఖాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోట్లాది అభిమానులు అతనిని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో జవాన్ రిలీజును పురస్కరించుకుని ఒక సరికొత్త రికార్డును లిఖించేందుకు ఆయన అభిమానుల సంఘం ముందుకు వచ్చింది. ముంబైలో ప్రముఖ థియేటర్ ‘గైటీ గెలాక్సీ’ ఉదయం 6 గంటలకు ‘జవాన్’ సినిమా స్పెషల్ షో ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా 51 ఏళ్ల చరిత్ర ఉన్న ‘గైటీ గెలాక్సీ’ లో మార్నింగ్ 6 గంటలకే స్క్రీనింగ్ కానున్న తొలి బాలీవుడ్ సినిమాగా షారుఖ్ జవాన్ నిలవనుంది. షారుక్ ఖాన్ ‘ఎస్.ఆర్.కె. ‘యూనివర్స్’ సంఘం ఈ షో కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గురువారం (సెప్టెంబర్ 7) ఉదయం 6 గంటలకు ‘గైటీ గెలాక్సీ’ ఫస్ట్ డే ఫస్ట్ షో ఏర్పాటుచేయనున్నారు. ఇదే అభిమానుల సంఘం షారుఖ్ గత సినిమా ‘పఠాన్’ రిలీజ్‌ను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ‘ఇంతకుముందు, షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రాన్ని ఉదయం 9 గంటలకు ప్రదర్శించడం ద్వారా 51 ఏళ్ల రికార్డును తిరగరాశాం. ఇప్పుడు జవాన్ సినిమాతో మళ్లీ చరిత్ర లిఖించే సమయం వచ్చింది’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు షారుఖ్ ఫ్యాన్స్.
కాగా ఆగస్ట్ 31న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనంలో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. షారూఖ్ ఖాన్‌కు దుబాయ్‌లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అతను తరచూ దుబాయ్‌కి వెళ్తుంటాడు. దుబాయ్ టూరిజం అంబాసిడర్ కూడా. ఈరోజు (ఆగస్టు 29) ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ పాట విడుదలకానుంది. ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్’ ద్వారా గౌరీఖాన్ ‘జవాన్’ చిత్రాన్ని నిర్మించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ‘పఠాన్’ 2023 ప్రారంభంలో విడుదలైంది. వివాదాస్పదమైనప్పటికీ, సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ‘జవాన్’ కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Good To Go for #Jawan Pre-release event CHIEF 🫡❤️🔥@iamsrk @RedChilliesEnt @Atlee_dir @anirudhofficial#NotRamaiyaVastavaiya #ShahRukhKhan pic.twitter.com/0SXD5ZyK83
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) August 29, 2023
Party prarambhamaindi!🕺 #NotRamaiyaVastavaiya song ippudu release ayyindi!
పార్టీ మొదలైంది!🕺 #NotRamaiyaVastavaiya సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది! #Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil & Telugu. pic.twitter.com/uxZLhJzqJG
— Red Chillies Entertainment (@RedChilliesEnt) August 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.