Shaakuntalam: ఎట్టకేలకు స్పందించిన శాకుంతలం టీమ్‌.. ఒక్క ట్వీట్‌తో రూమర్లన్నింటికీ చెక్‌..

|

Aug 02, 2022 | 7:30 PM

Shaakuntalam: సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతుండడం...

Shaakuntalam: ఎట్టకేలకు స్పందించిన శాకుంతలం టీమ్‌.. ఒక్క ట్వీట్‌తో రూమర్లన్నింటికీ చెక్‌..
Follow us on

Shaakuntalam: సమంత హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతుండడం, పీరియాడిక్‌ స్టోరీతో వస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని వారాలుగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆగిపోయాయి అన్న వార్తలు షికార్లు చేశాయి. సమంత బాలీవుడ్‌లో బిజీగా మారడంతో ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు బ్రేక్‌ పడిందనే వార్తలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

వార్తలు వైరల్‌ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఎట్టకేలకు స్పందించింది. చాలా రోజుల తర్వాత సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ను ఇచ్చింది. తాజాగా నీలిమ గుణ శాకుంతలం సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను నీలిమ గుణ ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని, కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ పనులు కొనసాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా సినిమాపై వస్తోన్న రుమర్లకు చెక్‌ పడినట్లైంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని గుణటీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను వెండి తెరపై చూపించనున్నారు. సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..