AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెన్సేషనల్ దర్శకుడికి బాలయ్య నుంచి పిలుపు..?

నందమూరి బాలయ్య మళ్లీ డీలా పడ్డారు. ఆయనకు వరుస పరాజయాలు రావడంతో అటు ఫ్యాన్స్‌ కూడా కాస్త అసహనంలో ఉన్నారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య అనుకుంటున్నారు.

సెన్సేషనల్ దర్శకుడికి బాలయ్య నుంచి పిలుపు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 4:31 PM

Share

నందమూరి బాలయ్య మళ్లీ డీలా పడ్డారు. ఆయనకు వరుస పరాజయాలు రావడంతో అటు ఫ్యాన్స్‌ కూడా కాస్త అసహనంలో ఉన్నారు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బాలయ్య అనుకుంటున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తుండగా.. ఈ మూవీ తరువాత సెన్సేషనల్ దర్శకుడికి అవకాశం ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆ దర్శకుడికి ఇటీవల బాలయ్య టీమ్‌ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటర్‌ ఏంటంటే.. వరుసగా ఐదు విజయాలతో టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెండ్ దర్శకుడిగా మారారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఆయన ఎఫ్‌ 2 సీక్వెల్ ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అన్నీ కుదిరితే ఆగష్టు నుంచి ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని ఆయన అనుకుంటున్నారు. ఇది పక్కనపెడితే ఇటీవల బాలయ్య టీమ్‌ నుంచి అనిల్‌కు ఫోన్ వచ్చిందట. బాలయ్యకు సరిపోయే ఓ కథను సిద్ధం చేయమని ఆ టీమ్‌.. సెన్సేషనల్ దర్శకుడికి చెప్పిందట. దీంతో కచ్చితంగా మంచి స్క్రిప్ట్‌తో వస్తానని అనిల్.. వారికి మాటిచ్చారట. కాగా అనిల్, బాలయ్యకు పెద్ద అభిమాని. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక బాలయ్యతో సినిమా తీసేందుకు అనిల్ రావిపూడి ఆ మధ్య రామారావు గారు అనే కథను రెడీ చేసినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌ సెట్స్ మీదకు వెళ్లకపోగా.. ఇప్పుడు బాలయ్య నుంచే ఆయనకు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అన్నీ కుదిరితే క్రేజీ కాంబోలో ఓ సినిమా రావడం పక్కా అంటున్నారు సినీ అభిమానులు.

Read This Story Also: Bheem for Rama Raju: చెర్రీకి ఎన్టీఆర్ గిఫ్ట్.. అదిరిపోయిందిగా..!