Bheem for Rama Raju: చెర్రీకి ఎన్టీఆర్ గిఫ్ట్.. అదిరిపోయిందిగా..!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో జక్కన్న తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇవాళ చెర్రీ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుంచి ఆయనకు ఓ గిఫ్ట్ ను ఇచ్చారు ఎన్టీఆర్.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో జక్కన్న తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇవాళ చెర్రీ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుంచి ఆయనకు ఓ గిఫ్ట్ ను ఇచ్చారు ఎన్టీఆర్. ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో వచ్చిన ఈ వీడియో అదిరిపోయింది. ఈ వీడియోలో చెర్రీ పాత్ర గురించి తనదైన స్టైల్ లో ఇంట్రడక్షన్ ఇచ్చారు ఎన్టీఆర్. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది..కలవడితే ఏగు చుక్క ఎగబడినట్టుంటది.. ఎదురుపడితే చావుకైనా చమట ధారకడ్తది. బంధువుకైనా వానికి బాన్చనౌతది. ఇంటి పేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు అంటూ చెర్రీ పాత్రను అద్భుతంగా వివరించారు ఎన్టీఆర్. ఇక వీడియోలో చెర్రీ లుక్ అదిరిపోగా.. కీరవాణి సంగీతం అదరగొట్టేస్తోంది. ఇక ఈ వీడియోతో మాటిచ్చినట్లుగానే చెర్రీకి గుర్తుండిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు ఎన్టీఆర్. మొన్నటికి మొన్న ఈ సినిమా నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ అదిరిపోగా.. ఇప్పుడు మరో వీడియోతో ‘ఆర్ఆర్ఆర్’పై అంచనాలను మరింత పెంచేశారు జక్కన్న.
కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలలో కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నారు.
As promised, I give you @AlwaysRamCharan! Happy birthday brother! Will cherish our bond forever.#BheemforRamaraju https://t.co/nCiO2YLgs2
— Jr NTR (@tarak9999) March 27, 2020