Nisha Noor: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆకలితో అల్లాడిపోయి.. చివరకు అనాథల ..
కొందరు సెలబ్రెటీలు మాత్రం తమ ఆర్థిక పరిస్థితుల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకున్నారు. దీంతో జీవితాన్ని నరకంగా మార్చుకుని..చివరి రోజుల్లో అనాథలుగా మారారు. ఇప్పటికీ కొంతరి మరణం అంతుచిక్కని మిస్టరీ. మరికొందరి జీవితం అంతులేని విషాదం. బలవంతమో లేక ఆర్థిక పరిస్థితుల సమస్యల కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగింది. తర్వాత ఆ స్టార్ హీరోయిన్ జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.

సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. నటీనటులుగా తమకంటూ ఓ పేరు తెచ్చుకోవాలని ఈ మెరిసే విశ్వంలోకి అడుగుపెట్టిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కొందరు అందం, అభినయం అంతకుమించిన ప్రతిభతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. టాప్ హీరోహీరోయిన్లుగా వెండితెరపై ఓ వెలుగు వెలిగి అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు. కొందరు సెలబ్రెటీలు మాత్రం తమ ఆర్థిక పరిస్థితుల కోసం తప్పుడు మార్గాలను ఎంచుకున్నారు. దీంతో జీవితాన్ని నరకంగా మార్చుకుని..చివరి రోజుల్లో అనాథలుగా మారారు. ఇప్పటికీ కొంతరి మరణం అంతుచిక్కని మిస్టరీ. మరికొందరి జీవితం అంతులేని విషాదం. బలవంతమో లేక ఆర్థిక పరిస్థితుల సమస్యల కారణంగా వ్యభిచార వృత్తిలోకి దిగింది. తర్వాత ఆ స్టార్ హీరోయిన్ జీవితం మాత్రం విషాదంగా ముగిసింది. ఆమె పేరు నిషా నూరు. ఆమె ఆఖరి రోజులు.. మరణం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు మర్చిపోలేరు. అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగి అంతలోనే ఈ ప్రపంచం నుంచి మయమైంది.
నిషా నూర్.. టిక్ టిక్ టిక్, ఇనిమై ఇటో ఇటో, శ్రీ రాఘవేంద్ర సహా పలు తమిళ చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు నిషా నూర్ పాపులారిటీ ఇతర నటీమణుల కంటే చాలా ఎక్కువగా ఉండేది. తమిళం, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో నటించింది. ఆమెతో సినిమాలు చేయాలని స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసేవారు. నిషా సినిమాల కోసం దర్శకనిర్మాతలు ఎదురుచూసేవారు. అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆమెకు.. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రేక్షకుల్లో నిషా క్రేజ్ తగ్గిపోవడంతో ఆమెకు సినిమాలు రాలేదు. నిషాను కథానాయికగా పెట్టి రిస్క్ చేయాలని ఏ దర్శకుడూ అనుకోలేదు. సినిమాలు తగ్గడంతో ఆమె వ్యభిచార వృత్తిలోకి దిగింది. ఓ నిర్మాత బలవంతం కారణంగానే ఆమె ఆ రోంపిలోకి దిగిందనే ప్రచారం జరిగింది. ఇక్కడే ఆమె జీవితంలో చెడు దశ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా నటి గురించే చర్చ మొదలైంది. ఆమె సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు పోయాయి.
2007లో ఓ దర్గా బయట అధ్వాన్న స్థితిలో కనిపించింది. ఆమెను గుర్తించడం కూడా కష్టమైంది. శరీరం అస్తిపంజరంలా మారిపోయింది. ఆమెను గుర్తించి కొందరు ఆసుపత్రికి తరలించగా.. ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది. అనారోగ్యంతో ఏప్రిల్ 23, 2007న మరణించింది.




