
Meena And Roja: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో రోజా, మీనా ముందువరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. టాలీవుడ్‌లోని దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన ఆడిపాడరీ హీరోయిన్లు. అంతేకాకుండ వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ముఠామేస్త్రీ, బాలకృష్ణ హీరోగా వచ్చిన బొబ్బిలి సింహం చిత్రాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వీరిద్దరు బయట కూడా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే నటి మీనా రోజాతో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను తాజాగా షేర్ చేశారు. ఈ ఫొటో 1993లో తీసింది కావడం విశేషం. ఆ సమయంలో మీనా అల్లరి ప్రియుడు సినిమా చిత్రీకరణలో ఉన్నారు. ఇదే సమయంలో అక్కడే షూటింగ్ జరుపుకుంటోన్న ముగ్గురు మొనగాళ్లు సెట్‌లో రోజా ఉన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మీనా..’అల్లరి ప్రియుడు షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగ్ జరుపుకుంటోన్న ముగ్గురు మొనగాళ్లు సెట్‌ను సందర్శించినప్పుడు. ‘రాజశేఖర’ పాట నాకు ఎంతో ఇష్టం’ అంటూ క్యాప్షన్ జోడించారు మీనా. ఇలా మీనా 28 ఏళ్ల క్రితం నాటి అపురూపమైన ఫొటోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే మీనా ప్రతీ గురువారం త్రో బ్యాక్ ఫొటోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు.
Also Read: Family Drama Trailer: సీరియల్ కిల్లర్ గా సుహాస్.. ఆకట్టుకుంటున్న ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ట్రైలర్
Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య సినిమాల లైనప్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్
Shankar Mahadevan: యువ గాయని పాటకు శంకర్ మహదేవన్ ఫిదా.. ‘సోల్ టచింగ్’ అంటూ పోస్ట్