మహేష్‌ సర్కారు వారి పాట: ట్యూన్స్‌ ఫైనల్ చేసిన పరశురామ్‌..!

పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే మూవీలో నటించనున్న విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 7:36 pm, Mon, 21 September 20
మహేష్‌ సర్కారు వారి పాట: ట్యూన్స్‌ ఫైనల్ చేసిన పరశురామ్‌..!

Sarkaru Vaari Paata movie: పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే మూవీలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. అన్నీ కుదిరితే దసరా తరువాత ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కథానుగుణంగా అమెరికాలో ఎక్కువ భాగం ఈ మూవీ షూటింగ్‌ జరగనుంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్‌ని ప్రారంభించినట్లు ఇటీవల థమన్ ప్రకటించగా, కొన్ని ట్యూన్స్‌ని రెడీ చేశాడని తెలుస్తోంది.

అంతేకాదు వాటిని దర్శకుడు పరశురామ్‌కి వినిపించడం, అందులో కొన్నింటికి ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని సమాచారం. ఇక ఇందులో మహేష్ బాబు ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. అందులో ఒకటి బ్యాంక్ ఆఫీసర్, మరొకటి పాన్ బ్రోక్‌ అని టాక్‌. అలాగే అనిల్ కపూర్ విలన్‌గా, విద్యా బాలన్ మహేష్ సోదరిగా నటిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? ఈ మూవీలో ఎవరెవరు నటించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More:

సుధా కొంగర దర్శకత్వంలో అజిత్‌.. రివీల్ చేసిన సంగీత దర్శకుడు

అనురాగ్‌ చాలా సున్నితమైన వ్యక్తి.. శిష్యుడికి వర్మ మద్దతు