చేసింది రెండే సినిమాలు.. కానీ ఈలోపే చెండాలం..!

చేసింది రెండే సినిమాలు.. కానీ ఈలోపే చెండాలం..!

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా ఆలీఖాన్ ఒక యంగ్ హీరోతో పీకల్లోతూ ప్రేమలో ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘కేదార్నాధ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినా, ఆ తర్వాత వచ్చిన ‘సింబా’ చిత్రం పెద్ద సక్సెస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.    ఇక అసలు విషయంలోకి వెళ్తే తన మొదటి సినిమా […]

Ravi Kiran

|

Feb 20, 2019 | 6:46 PM

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారా ఆలీఖాన్ ఒక యంగ్ హీరోతో పీకల్లోతూ ప్రేమలో ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘కేదార్నాధ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినా, ఆ తర్వాత వచ్చిన ‘సింబా’ చిత్రం పెద్ద సక్సెస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.   

ఇక అసలు విషయంలోకి వెళ్తే తన మొదటి సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సారా ప్రేమలో ఉందని ఒక వార్త బీ-టౌన్ లో హల్ చల్ చేస్తోంది. ఇలా ఒకవైపు వార్తలు జోరుగా ప్రచారం అవుతుంటే.. సుశాంత్ బర్త్ డే రోజున అర్ధరాత్రి సారా సుశాంత్ ఇంటికి వెళ్లడం, ప్రత్యేకంగా కేక్ కట్ చేయించడం.. ఇదంతా మీడియా దృష్టిలో పడడంతో ఇప్పుడు ఇదే బాలీవుడ్ లో హాట్ టాపిక్.    

ఈ విషయం ఇంట్లో తెలిసి సవతి తల్లి కరీనా కపూర్ సారాకు వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలా డేటింగ్, లవ్ అంటూ పిచ్చి వేషాలు వేస్తే లైఫ్ నాశనం అవుతుందని హెచ్చరించిందట. ఇకపోతే దీనిపై సైఫ్ కూడా కూతురుకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడని వినికిడి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu