త్రివిక్రమ్‌గారికి నా అవసరం లేదు: హైపర్ ఆది

త్రివిక్రమ్‌గారికి నా అవసరం లేదు: హైపర్ ఆది

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ వల్ల చాలామంది కమెడియన్స్ కి మంచి గుర్తింపు దక్కింది. అందులో ఒకరు హైపర్ ఆది. ఆది అటు జబర్దస్త్ తో పాటు ఇటు సిల్వర్ స్క్రీన్ పై కూడా తనదైన శైలిలో కామెడీతో అలరిస్తున్నాడు. ఇక హైపర్ ఆది అంటే పంచులకు, ప్రాసలకు పెట్టింది పేరు. అతను నటించిన సినిమాలు తక్కువే అయినా తన పాత్రకు అతనే డైలాగులు రాసుకుంటాడని వినికిడి. ఇది ఇలా ఉంటే ఆది రీసెంట్ […]

Ravi Kiran

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:28 PM

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ వల్ల చాలామంది కమెడియన్స్ కి మంచి గుర్తింపు దక్కింది. అందులో ఒకరు హైపర్ ఆది. ఆది అటు జబర్దస్త్ తో పాటు ఇటు సిల్వర్ స్క్రీన్ పై కూడా తనదైన శైలిలో కామెడీతో అలరిస్తున్నాడు. ఇక హైపర్ ఆది అంటే పంచులకు, ప్రాసలకు పెట్టింది పేరు. అతను నటించిన సినిమాలు తక్కువే అయినా తన పాత్రకు అతనే డైలాగులు రాసుకుంటాడని వినికిడి. ఇది ఇలా ఉంటే ఆది రీసెంట్ గా దర్శకుడు త్రివిక్రమ్ ని కలిశాడు. దీనితో త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంలో మాటలు రచయితగా హైపర్ ఆదికి ఛాన్స్ ఇచ్చాడని రూమర్స్ వచ్చాయి.

అయితే తాజాగా ఈ విషయంపై ఆది స్పందిస్తూ అవి వట్టి పుకార్లే అని కొట్టి పారేశాడు. త్రివిక్రమ్ గారంటే తనకు చాలా అభిమానం అని అందుకే ఆయన్ని మూడు సార్లు కలిశాను అని అన్నాడు. ఇంతకు మించి వేరే ఏమి లేదని చెప్పిన ఆది ఆయన సినిమాకు మాటలు రాసేంతటి వ్యక్తిని కాదని చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ గారు ఆయన తీసే సినిమాలకు కథ, మాటలు సొంతంగా రాసుకుంటారని ఎవరి సహాయం ఆయనకు అక్కర్లేదని అని అన్నాడు. వరసగా సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయని… కానీ మంచి ప్రాముఖ్యత కలిగిన పాత్రలు మాత్రమే తాను నటిస్తానని హైపర్ ఆది వెల్లడించాడు.        

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu