మరిది సినిమాలో అతిథి పాత్ర..?

అక్కినేని వారసుడిగా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఒక్క హిట్‌ను కూడా ఖాతాలోకి వేసుకోలేకపోయాడు. ఇప్పటివరకు పేరున్న దర్శకులతోనే పనిచేసినప్పటికీ, వారెవరూ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయారు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాలుగో చిత్రంలో నటిస్తున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:25 pm, Wed, 18 December 19
మరిది సినిమాలో అతిథి పాత్ర..?

అక్కినేని వారసుడిగా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఒక్క హిట్‌ను కూడా ఖాతాలోకి వేసుకోలేకపోయాడు. ఇప్పటివరకు పేరున్న దర్శకులతోనే పనిచేసినప్పటికీ, వారెవరూ అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయారు. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాలుగో చిత్రంలో నటిస్తున్నాడు. ఎలాంటి హడావిడి లేకుండా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో అఖిల్ వదిన సమంత అతిథి పాత్రలో కనిపించబోతుందట.

భాస్కర్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘బొమ్మరిల్లు’లో… హీరో సిద్ధార్థ్, తన కథను నటి జయలక్ష్మికి చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రను సమంతతో చేయించాలని దర్శకుడు భావిస్తున్నారట. ఈ విషయాన్ని సమంతతో చెప్పడం, ఆమె కూడా ఆ పాత్రలో నటించేందుకు ఒప్పుకోవడం జరిగిందన్న టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అఖిల్ 4వ చిత్రానికి సమంత ఒక ఆకర్షణగా మారే అవకాశం ఉంటుంది. కాగా ఈ ఏడాది నాగార్జున నటించిన ‘మన్మథుడు 2’లో సమంత అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.

కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అఖిల్ నాలుగో చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నటిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై ఇటు అఖిల్, అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చాలా అంచనాలు పెట్టుకున్నారు.