మహేష్ Vs బన్నీ: ఆ విషయంలోనూ తగ్గమంటున్నారా..!
మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్.. వీరిద్దరి మధ్య పోటీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతి రేస్‌లో ఈ ఇద్దరు పోటీ పడబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రానుండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురంలో జనవరి 12న విడుదల కాబోతోంది. కాగా మొదట ఈ రెండు చిత్రాలకు ఒకే రోజు విడుదల తేది ఫిక్స్ చేశారు. అయితే ఇలా రెండు సినిమాలు […]

మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్.. వీరిద్దరి మధ్య పోటీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సంక్రాంతి రేస్‌లో ఈ ఇద్దరు పోటీ పడబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు జనవరి 11న రానుండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురంలో జనవరి 12న విడుదల కాబోతోంది. కాగా మొదట ఈ రెండు చిత్రాలకు ఒకే రోజు విడుదల తేది ఫిక్స్ చేశారు. అయితే ఇలా రెండు సినిమాలు ఒకే రోజున వస్తే కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన దర్శకనిర్మాతలు.. ఎట్టకేలకు చర్చలు జరుపుకొని రిలీజ్ డేట్లను మార్చుకున్నారు(కానీ విడుదల తేదీల విషయంలో వెనక్కి తగ్గేందుకు అటు మహేష్, ఇటు బన్నీ.. ఎవరూ ఒప్పుకోలేదని.. కానీ నిర్మాతలు బుజ్జగించడంతో కాంప్రమైజ్ అయ్యారన్న టాక్ అప్పట్లో నడిచింది).
ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి మహేష్, బన్నీ ఇద్దరి మధ్య పోటీ కాస్త వారి అభిమానుల మధ్య వార్‌గా మారిపోయింది. మా హీరో సినిమా హిట్ అవుతుందటే.. మా హీరో సినిమా హిట్ అవుతుందంటూ ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. అంతేనా ప్రత్యర్థి హీరోకు సంబంధించిన పోస్టర్, పాటలు.. ఇలా ఏం వచ్చినా వాటిని ట్రోల్ చేస్తూ, మీమ్స్ చేస్తున్నారు. ఇక ఇదంతా చూస్తుంటే.. వీరిద్దరి మధ్య ఇప్పుడున్న వార్.. ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అర్థమవుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరో విషయంలోనూ మహేష్, బన్నీల మధ్య పోటీ ఉండబోతుందట. అదేంటంటే వారి వారి సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకలు ఒకే రోజు చేయాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. జనవరి 5న హైదరాబాద్‌లో సరిలేరు ప్రీ రిలీజ్ వేడుక జరగబోతోంది. ఈ విషయాన్ని ఇటీవలే మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అల వైకుంఠపురంలో ప్రీ రిలీజ్ వేడుక కూడా అదే రోజు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వేడుకకు వైజాగ్‌ను వేదికగా ఫిక్స్ చేసినట్లు కూడా టాక్. మరి ఇందులో నిజమెంత..? ప్రీ రిలీజ్ తేదీ విషయంలోనూ ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ ఎందుకు..? అసలు ఈ సంక్రాంతి పోరులో ఎవరు గెలుస్తారు..? ఎవరు నిలుస్తారు..? అన్న ప్రశ్నలపై ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.



