మేడమ్.. మాకో టికెట్ ఇవ్వరూ ప్లీజ్..!
సినిమా విడుదల అన్నాక ప్రమోషన్లు చాలా అవసరం. ప్రమోషన్లు ఎంత బాగా చేస్తే.. మొదటి మూడు రోజులు కలెక్షన్లు అంత బాగా వస్తాయి(ఆ తరువాత టాక్‌ను బట్టి కలెక్షన్లు వస్తాయి. అది వేరే విషయం). అందుకే నటీనటులు, దర్శకనిర్మాతలు, సినిమాలో పనిచేసిన ప్రధాన తారాగణం తమ మూవీని ప్రమోట్ చేసేందుకు ఆసక్తిని చూపుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్ల కోసం రంగంలోకి దిగింది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా కలిసి […]

సినిమా విడుదల అన్నాక ప్రమోషన్లు చాలా అవసరం. ప్రమోషన్లు ఎంత బాగా చేస్తే.. మొదటి మూడు రోజులు కలెక్షన్లు అంత బాగా వస్తాయి(ఆ తరువాత టాక్‌ను బట్టి కలెక్షన్లు వస్తాయి. అది వేరే విషయం). అందుకే నటీనటులు, దర్శకనిర్మాతలు, సినిమాలో పనిచేసిన ప్రధాన తారాగణం తమ మూవీని ప్రమోట్ చేసేందుకు ఆసక్తిని చూపుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రమోషన్ల కోసం రంగంలోకి దిగింది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా.
సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా కలిసి ప్రతిరోజు పండగే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలువురికి సినిమా టికెట్లను అమ్మింది రాశి. హైదరాబాద్‌లోని గోకుల్ థియేటర్‌లో ప్రతిరోజు పండగే సినిమా టికెట్లను రాశి అమ్మగా.. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు థియేటర్ వద్దకు వెళ్లి టికెట్లు కొనేందుకు ఎగబడ్డారు. లోపలికి వెళ్లి సెల్ఫీలు తీసుకునే అవకాశం లేకపోవడంతో.. బయటి నుంచి ఆమెను ఫొటోలు తీసుకున్నారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ప్రతిరోజు పండగే చిత్రాన్ని మారుతి తెరకెక్కించాడు. సత్యరాజ్, రావు రమేష్, నరేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ ఏడాది ‘చిత్రలహరి’ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఈ మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు. మరి ఈ మూవీ ఈ మెగామేనల్లుడికి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.
Good promo strategy! Fans @ Gokul Theatre, Hyd to buy #PratiRojuPandaage tickets from #AngelAarna @RaashiKhanna
Grand release on Dec 20th!@IamSaiDharamTej @DirectorMaruthi @MusicThaman #BunnyVas @SKNonline #PratirojuPandaageOnDec20th pic.twitter.com/zJ707dadvW
— Rajasekar (@sekartweets) December 18, 2019