Salaar: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. సలార్‌ మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సలార్‌. కేజీఎఫ్‌ సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్‌లో యష్‌ను ఓ రేంజ్‌లో చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌ను ఎలా చూపించనున్నాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది...

Salaar: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. సలార్‌ మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌..
Prabhas in Salar Movie

Updated on: Jan 07, 2023 | 5:41 PM

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం సలార్‌. కేజీఎఫ్‌ సినిమాతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్‌లో యష్‌ను ఓ రేంజ్‌లో చూపించిన ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌ను ఎలా చూపించనున్నాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 85 శాతం పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇంట్రెస్టింట్ అప్‌డేట్ ఇచ్చింది. సలార్‌ చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘2023 ఏడాది కాదు సలార్‌’ (2023 సాల్‌ నహి, సాలార్‌ హై) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే నిజానికి సలార్‌ మూవీ కంటే ముందుగానే ఆదిపురుష్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

అయితే ఆదిపురుష్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే సినిమాకు భారీగా వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ఉండడం, చిత్ర యూనిట్ సైతం మేకింగ్ విషయంలో జాగ్రత్తలు పడడంతో విడుదల ఆలస్యమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం. ఆదిపురుష్‌ సినిమా సలార్‌ తర్వాతే విడుదల కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రభాస్‌ నటిస్తోన్న మరో చిత్రం కూడా ఇదే ఏడాదిలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..