”ఈ అమానవీయ ప్రపంచంలో”.. అంటూ సాయి పల్లవి ఆవేదన

ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా యుద్దం చేస్తుంటే, మరోవైపు అమానవీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడులో ఓ తండ్రీ, కొడుకులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించి, వారి చావుకు కారణమయ్యారు.

''ఈ అమానవీయ ప్రపంచంలో''.. అంటూ సాయి పల్లవి ఆవేదన
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 5:04 PM

ఓ వైపు కరోనాతో ప్రపంచమంతా యుద్దం చేస్తుంటే, మరోవైపు  అమానవీయ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తమిళనాడులో ఓ తండ్రీ, కొడుకులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించి, వారి చావుకు కారణమయ్యారు. ఇక నిన్నటికి నిన్న ఓ ఏడేళ్ల బాలికను దారుణంగా అత్యాచారం చేసి, క్రూరంగా చంపేశారు. ఈ వరుస పరిణామాలపై నటి సాయి పల్లవి సోషల్ మీడియాలో స్పందించారు.

మానవ జాతి మీద రోజురోజుకు నమ్మకం క్షీణించిపోతుంది. మూగ జీవాలకు సాయం చేయాలంటూ మనకు ఇచ్చిన శక్తిని తప్పుగా వాడుకుంటున్నాం. బలహీనులైన వారిని మనం బాధపెడుతున్నాం. మన రాక్షస ఆనందాల కోసం పిల్లలను చంపేస్తున్నాం. రోజు రోజు జరుగుతున్న ఇలాంటి సంఘటనలను ఇకనైనా ఆపేయాలని ప్రకృతి మనకు బుద్ధి చెప్తున్నట్లు అనిపిస్తోంది. ఘోరాలను చూస్తూ దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఈ అమానవీయ ప్రపంచంలో మరో బిడ్డ పుట్టడానికి అర్హత లేదు. ఏదైనా లైమ్‌లైట్‌లోకి వచ్చినప్పుడో లేక సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నప్పుడో న్యాయం జరుగుతుంది. కానీ ఎన్నో క్రైమ్‌లు బయటకు రావడం లేదు. వాటి పరిస్థితి ఏంటి..? అని సాయి పల్లవి ఆవేదనను వ్యక్తం చేశారు.