భానుమతీ & రామకృష్ణ సినిమా రివ్యూ..

క‌రోనా నేప‌థ్యంలో ఓటీటీ వేదిక‌గా విడుదల అయిన మరొక చిత్రం ‘భానుమతి అండ్ రామకృష్ణ’. నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ రొమాంటి లవ్ డ్రామా ఆహా లో జులై 3న రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

భానుమతీ & రామకృష్ణ సినిమా రివ్యూ..

భానుమతీ & రామకృష్ణ రివ్యూ

యాక్ట‌ర్స్ : నవీన్ చంద్ర, సలోనీ లుథ్రా, రాజా చెంబోలు, వైవా హ‌ర్హ‌

రచన,దర్శకత్వం : శ్రీకాంత్ నాగోతి

నిర్మాతలు : యస్వంత్ ములుకుట్ల

సంగీతం : శ్రావణ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్ యు

క‌రోనా నేప‌థ్యంలో ఓటీటీ వేదిక‌గా విడుదల అయిన మరొక చిత్రం ‘భానుమతి అండ్ రామకృష్ణ’. నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా డైరెక్ట‌ర్ శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ రొమాంటి లవ్ డ్రామా ఆహా లో జులై 3న రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

స్టోరీ:

ముప్పై ఏళ్లు దాటిన వాళ్ల‌లో ప్రేమ ఉండ‌దా. జీవితంలో అప్పుడే నిల‌దొక్కుకుంటున్న థ‌ర్టీ ప్ల‌స్ బ్యాచ్ ప్రేమ‌లు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమా క‌థాశం. భానుమతి ఓ ముఫై ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగిని. ఎంప్లాయ్. తన లైఫులో ప్రేమ విఫ‌ల‌మ‌వ్వ‌డంతో వలన ఈమె…లవ్, రిలేషన్ పట్ల కాస్త గంద‌ర‌గోళంలో ఉంటుంది. ఈ క్ర‌మంలో పల్లెటూరు నేప‌థ్యం ఉన్న‌ రామకృష్ణ(నవీన్ చంద్ర) ఉద్యోగ బ‌దిలీపై హైదరాబాద్ లో భానుమతి చేసే సంస్థ‌లో ఆమెకు అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. తొలుత‌ రామకృష్ణను పెద్ద లైక్ చెయ్య‌ని భానుమతి క్రమేణా అంతని ప్రేమలో పడిపోతుంది. రెండు భిన్న నేప‌థ్యాలు, మనస్థత్వాలు కలిగిన ఈ ఇరువురి ప్రేమ ప్ర‌యాణం ఏ తీరానికి చేరింది అనేది మొత్తంగా భానుమతి- రామకృష్ణ చిత్ర‌ సారాంశం…

ప్లస్ పాయింట్స్:

ఓ ల‌వ్ స్టోరీలో ప్రేక్షకుడు నిమగ్న‌మై మంచి ఫీలింగుతో చూస్తుంటే అది హిట్ట‌యిన‌ట్టే. భానుమతి- రామకృష్ణ మూవీ చూసేది ఓటీటీ అయినా ఎక్క‌డా స్టాఫ్ చెయ్యాల‌నిపించ‌దు. సినిమా చూస్తుండ‌గా ఎవ‌రైనా క‌దిలిస్తే చిరాకు వేసేలా ద‌ర్శ‌కుడు సినిమా తీశాడు. ప్రధాన పాత్రల పోషించి న‌వీన్ చంద్ర‌, స‌లోని అద్బుతంగా న‌టించారు. ముఖ్యంగా న‌వీన్ చంద్ర త‌నలోని మ‌రో కోణాన్ని ఆవిష్క‌రించాడు. రామకృష్ణ పాత్ర‌లో ఇమిడిపోయాడు. రొమాంటిక్ సన్నివేశాలు తెర‌కెక్కించిన విధానం ముచ్చటేస్తుంది. సంభాషణలు, స్క్రీన్ ప్లే అన్ని సూప‌ర్బ్ గా సెట్ అయ్యాయి. కొన్ని సన్నివేశాల్లో నేప‌థ్య సంగీతం మ‌న‌సులు తాకుతుంది. హీరోయిన్ సలోని నటన కూడా చాలా స‌హజంగా అనిపించింది. కమెడియన్ హర్ష చేసిన పాత్ర ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ మైండ్ సెట్ ని సాక్షాత్క‌రిస్తుంది.

మైనస్ పాయింట్స్:

క‌థ ప్రారంభించిన‌ప్పుడే క్లైమాక్స్ ఏంట‌న్న‌ది తెలిసిపోతుంది. వినోదం ఇంకాస్త జోడిస్తే సినిమా మ‌రికొన్ని వ‌ర్గాలకు చేరువ‌య్యేది. ప్లాట్ కూడా అందిరికీ క‌నెక్ట్ అయ్యేది కాదు. ఇక ప్లీ క్లైమాక్స్ లో ఎమోష‌నల్ క‌నెక్టివిటీ తెగిపోయిన ఫీలింగ్ వ‌స్తుంది.

సాంకేతిక విభాగం:

ల‌వ్ స్టోరీకి ప్ర‌ధానంగా కావాల్సిన‌వి విజువ‌ల్స్ అండ్ మ్యూజిక్. వీటిల్లో మూవీ యూనిట్ నూటికి నూరు మార్కులు సంపాదించింది. ర‌వికాంత్ పేరేపు మంచి ఎడిట‌ర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నిర్మాణ విలువ‌లు ప‌ర్వాలేదు. ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ నాగోతి త‌ను అనుకున్న‌ది ప‌క్కాగా తెర మీద చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. కమర్షియల్ అంశాల కోసం…అవసరం లేని హంగులు జోడించకుండా ఫ్యూర్ సోల్ ఉన్న సినిమా తీశాడు.