ఆకట్టుకుంటున్న ‘చిత్రలహరి’ టీజర్

గత కొంతకాలంగా కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఫేస్ చేస్తున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత చిత్రలహరి సినిమాను పట్టాలెక్కించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు దర్శకుడు కిశోర్ తిరుమల. సినిమాలోని ప్రధాన పాత్రల స్వభావాలను టీజర్‌లోనే చెప్పేశారు. ఆపాత్రల మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ సినిమా కథ అంటూ హింట్‌ […]

ఆకట్టుకుంటున్న ‘చిత్రలహరి’ టీజర్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 12, 2019 | 6:32 PM

గత కొంతకాలంగా కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఫేస్ చేస్తున్నాడు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత చిత్రలహరి సినిమాను పట్టాలెక్కించాడు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ టీం. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు దర్శకుడు కిశోర్ తిరుమల. సినిమాలోని ప్రధాన పాత్రల స్వభావాలను టీజర్‌లోనే చెప్పేశారు. ఆపాత్రల మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ సినిమా కథ అంటూ హింట్‌ ఇచ్చేశారు.

ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేథ పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ మరో కీలక పాత్రలో అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.