‘ఆర్ఆర్‌ఆర్’ నిర్మాతకు ‘కేజీఎఫ్’ దర్శకుడి టెన్షన్‌..!

ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యకు ఇప్పుడు మరో కొత్త టెన్షన్ మొదలైందట. అది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వలనేనని ఫిలింనగర్‌లో టాక్‌ నడుస్తోంది.

'ఆర్ఆర్‌ఆర్' నిర్మాతకు 'కేజీఎఫ్' దర్శకుడి టెన్షన్‌..!

ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్యకు ఇప్పుడు మరో కొత్త టెన్షన్ మొదలైందట. అది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వలనేనని ఫిలింనగర్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే అసలు ప్రశాంత్ విషయంలో దానయ్యకు టెన్షన్ ఎందుకంటే..!

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు తెలుగు నిర్మాతలు ప్రశాంత్‌పై కన్నేశారు. ఆ క్రమంలోనే కొంతమంది నిర్మాతలు ఈ దర్శకుడికి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశారు. అందులో డీవీవీ దానయ్య ఒకరని తెలుస్తోంది. ప్రశాంత్‌కి దానయ్య రూ.6కోట్ల నాన్‌-రీఫండబుల్‌ అడ్వాన్స్(తిరిగి ఇవ్వని) ఇచ్చారట. ఇక ప్రస్తుతం ప్రశాంత్‌, యశ్‌తో కేజీఎఫ్ సీక్వెల్ తీస్తుండగా.. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్‌తో ఆయన సెట్స్‌ మీదకు వెళ్లనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్టీఆర్-ప్రశాంత్‌ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? ఎప్పుడు పూర్తి అవుతుంది..? అని చెప్పడం కష్టమే. అలాగే ఆ సినిమా పూర్తి అయిన తరువాతనే దానయ్య నిర్మాణంలో ప్రశాంత్ సినిమాను తెరకెక్కిస్తానని చెప్పారట. దీంతో దానయ్య టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ప్రశాంత్‌ ఏదైనా సానుకూల నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.

Click on your DTH Provider to Add TV9 Telugu