AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నకు ఏ మాత్రం తగ్గనంటోన్న ధ్రువ్‌

భారత సినీ ఇండస్ట్రీల్లో గుర్తించుకోదగ్గ నటీనటుల లిస్ట్‌లో చియాన్ విక్రమ్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఏ పాత్రలో నటించినా, అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్.

నాన్నకు ఏ మాత్రం తగ్గనంటోన్న ధ్రువ్‌
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 04, 2020 | 12:36 PM

Share

భారత సినీ ఇండస్ట్రీల్లో గుర్తించుకోదగ్గ నటీనటుల లిస్ట్‌లో చియాన్ విక్రమ్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఏ పాత్రలో నటించినా, అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. అంతేకాదు ప్రతి సినిమా కోసం భౌతికంగా కూడా ఆయన చాలా కష్టపడుతుంటారు. అందుకే దేశం గర్వించదగ్గ హీరోల్లో ఒకడిగా అతడు వెలుగొందుతున్నారు. ఇదిలా ఉంటే విక్రమ్ తనయుడు ధ్రువ్‌ కూడా ఇప్పుడు అదే దారిలో వెళుతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్‌ ఆదిత్య వర్మతో హీరోగా పరిచయం అయిన ధ్రువ్‌.. ఆ సినిమాతో మంచి పేరునే సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ నటుడు తన తండ్రితో కలిసి నటించబోతున్నారు.

పిజ్జా, పేట సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్న కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో విక్రమ్, ధ్రువ్‌ కలిసి నటించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుండగా.. ఇందులో ధ్రువ్‌ హీరోగా, విక్రమ్‌ విలన్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కసరత్తులు చేసిన ధ్రువ్‌, కొత్త అవతారంలోకి మారిపోయాడు. భారీగా కండలు పెంచి వావ్ అనిపిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ ఫొటోలపై అభిమానులు తండ్రి తగ్గ తనయుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా లలిత్‌ కుమార్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు.

Follow Us
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..