మియా, ఛార్మీ.. వీళ్ళే ‘ఇస్మార్టా’.. రౌడీ ఫ్యాన్స్ ఫైర్!

సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ నోటి దురుసుకు.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’పై ఆయన చేసిన ట్వీట్‌కు రౌడీ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్ కంటే తక్కువగా ‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్స్ ఉన్నాయంటూ చేసిన ట్వీట్‌పై కొందరు విరుచుకుపడ్డారు. ‘ఇస్మార్ట్‌గా లేని కామ్రేడ్‌ కంటే ఇస్మార్ట్ శంకర్ చాలా ఇస్మార్ట్‌గా ఉన్నాడా… లేదా నాన్ […]

మియా, ఛార్మీ.. వీళ్ళే 'ఇస్మార్టా'.. రౌడీ ఫ్యాన్స్ ఫైర్!
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Jul 30, 2019 | 7:54 PM

సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే రామ్ గోపాల్ వర్మ నోటి దురుసుకు.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’పై ఆయన చేసిన ట్వీట్‌కు రౌడీ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్స్ కంటే తక్కువగా ‘డియర్ కామ్రేడ్’ కలెక్షన్స్ ఉన్నాయంటూ చేసిన ట్వీట్‌పై కొందరు విరుచుకుపడ్డారు.

‘ఇస్మార్ట్‌గా లేని కామ్రేడ్‌ కంటే ఇస్మార్ట్ శంకర్ చాలా ఇస్మార్ట్‌గా ఉన్నాడా… లేదా నాన్ ఇస్మార్ట్ కామ్రేడ్ శంకర్ కంటే తక్కువ ఇస్మార్ట్‌గా ఉన్నాడా అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. ఇక ఈ విషయం రామ్ విజయానికి తెలుసనీ లాస్ట్‌లో పంచ్ ఇచ్చాడు.

సెన్స్‌లెస్ శంకర్ కంటే డియర్ కామ్రేడ్ చాలా సెన్సిబుల్ లేదా సెన్స్‌లెస్ శంకర్ సెన్సిబుల్ ఉన్న డియర్ కామ్రేడ్‌కు సరితూగడు. వాస్తవమేమిటో విజయ్ ఫాలోవర్ రామ్ అలియాస్ ఆర్జీవికి బాగా తెలుసు అంటూ ఓ నెటిజన్ షాక్ ఇవ్వగా.. మీరు పక్షపాతంతో వ్యవహరించకూడదు. ముందు డియర్ కామ్రేడ్ చూడు. ఆ తర్వాత కలెక్షన్ల గురించి మాట్లాడు అని మరో నెటిజన్ విమర్శించాడు.

ఇంకో నెటిజన్ ఆర్జీవీకి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తూ ‘ నాన్ఇస్మార్ట్ చార్మీ కంటే మియా మాల్కోవా ఎక్కువ స్మార్టా లేదా నాన్ ఇస్మార్ట్ చార్మీ.. ఇస్మార్ట్ మియా కంటే ఎక్కువ కాదా. ఈ వాస్తవం ఆర్జీవి కంటే అతని పడకగదికే బాగా తెలుసని’ ట్వీట్ చేశారు. ఇలా అందరూ కూడా ట్విట్టర్ వేదిక ద్వారా ఆర్జీవీని రఫ్ ఆడుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu