నగ్నంగా సుశాంత్ మాజీ మేనేజర్ మృతదేహం : ఖండించిన పోలీసులు

నగ్నంగా సుశాంత్ మాజీ మేనేజర్ మృతదేహం : ఖండించిన పోలీసులు

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మేనేజర్​ దిశా సలియన్​ డెడ్‌బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవలే మీడియాలో స‌ర్కులేట్ అయిన‌ వార్తలను ముంబై పోలీసులు ఖండించారు.

Ram Naramaneni

| Edited By:

Aug 09, 2020 | 9:54 PM

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్ మాజీ​ మేనేజర్​ దిశా సలియన్​ డెడ్‌బాడీని నగ్నంగా గుర్తించినట్లు ఇటీవలే మీడియాలో స‌ర్కులేట్ అయిన‌ వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. అవన్నీ ఫేక్ అని డిప్యూటీ కమిషనర్​ విశాల్​ ఠాకూర్​ తేల్చి చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్లేసుకు చేరుకున్నారని.. ఆమె పేరెంట్స్ సమక్షంలోనే మృతదేహానికి పంచ‌నామా చేసినట్లు తెలిపారు.

జూన్​ 8న రాత్రి మలాద్​లోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి దిశ సూసైడ్ చేసుకుంది. సరిగ్గా ఐదు రోజుల తర్వాత సుశాంత్​ ముంబైలోని తన నివాసంలో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించాడు. ఈ రెండు ఘటనలు బాలీవుడ్​ సహా రాజకీయంగా క‌ల‌కలం రేపాయి. రెండు వేర్వేరు ఘటనలను కొంత మంది నాయకులు రాజకీయ ప్ర‌యోజ‌నాల కోసం ఉపయోగిస్తున్నారని శివసేన పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​ ఆరోపించారు. ఇప్పటికే తమ కుమార్తె మృతిపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని దిశ​ ఫ్యామిలీ స్ప‌ష్టం చేసింది. ముంబై పోలీసులు చాలా నిజాయతీగా ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని.. తమను అపఖ్యాతిపాలు చేయాలని చూడటం బాధ కలిగించిందని వాపోయారు.

Also Read : ట్విట్ట‌ర్ మోత మోగిపోయింది : మ‌హేశ్ ఫ్యాన్స్ వ‌రల్డ్ రికార్డ్‌

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu