‘వెబ్‌ సిరీస్’‌లోకి రేణు ఎంట్రీ.. ఆశీస్సులు కావాలన్న నటి

నటి రేణు దేశాయ్‌ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు రేణు సిద్ధమయ్యారు. వచ్చే నెల నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ మొదలు కానుంది

'వెబ్‌ సిరీస్'‌లోకి రేణు ఎంట్రీ.. ఆశీస్సులు కావాలన్న నటి
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 12:50 PM

Renu Desai news: నటి రేణు దేశాయ్‌ మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు రేణు సిద్ధమయ్యారు. వచ్చే నెల నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ మొదలు కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన రేణు.. ఆ ప్రాజెక్ట్ వివరాలను కూడా తెలిపారు.

”కెమెరా ముందుకు రాబోతున్నా. ఓ అద్భుతమైన వెబ్‌సిరీస్‌కి సంతకం చేశా. వచ్చే నెల నుంచి ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తా. వాస్తవాలను తెలుసుకోవాలనుకునే మహిళ పాత్రలో నటిస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు కావాలి. ఈ వెబ్‌ సిరీస్‌కి ఎమ్‌ఆర్ కృష్ణ మామిడాల దర్శకత్వం వహిస్తున్నారు. డీఎస్ రావు, ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్నారు. దాశరధి సివేంద్ర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు” అని రేణు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉండే ఓ ఫొటోను షేర్ చేశారు. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ అహాలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా పవన్ కల్యాణ్ బద్రీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు రేణు. అదే సంవత్సరం తమిళంలో జేమ్స్ పాండ్ అనే చిత్రంలో కనిపించారు. ఇక మూడు సంవత్సరాల తరువాత జానీలో ఆమె నటించారు. నటిగా ఎక్కువ సినిమాల్లో నటించనప్పటికీ.. పవన్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అయితే పవన్‌తో విడాకుల తరువాత పుణెకు వెళ్లిన రేణు మంగలాస్టక్ వన్స్ మోర్ అనే నిర్మాతగా మారి.. 2014లో ఇష్క్ వాలా లవ్ అనే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఇక ఆ మధ్యన బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన రేణు.. ఇప్పుడు డిజిటల్‌లోకి‌ ఎంట్రీ ఇస్తున్నారు.

Read More:

షో తరువాత చాలా కోల్పోయాం.. ‘బిగ్‌బాస్’‌పై మాజీ కంటెస్టెంట్‌ల సంచలన వ్యాఖ్యలు

ఐదేళ్ల వయసులోనే కిమ్‌ పడవ నడిపేవాడట

https://www.instagram.com/p/CFWDCfThgEm/?igshid=1dyxip4bpk9we

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?