Red Movie: హీరో రామ్‌లో సరికొత్త యాంగిల్ చూస్తారు.. సంక్రాంతికి వస్తున్న రెడ్ మూవీ గురించి..
Red Movie: ఇస్మార్ట్ శంకర్‌తో అలరించిన హీరో రామ్ ఈ సంవత్సరం సంక్రాంతికి రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.
Red Movie: ఇస్మార్ట్ శంకర్‌తో అలరించిన హీరో రామ్ ఈ సంవత్సరం సంక్రాంతికి రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిశోర్ తిరుమల సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
తాను ఇప్పటి వరకు రామ్‌తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఇప్పుడు రెడ్ సినిమాలు చేశానని అన్నారు. ఇందులో వేటికవి విభిన్న ప్రత్యేకతను కలిగిన సినిమాలని తెలిపారు. ఇక ఇప్పడు వస్తున్న రెడ్ సినిమాలో ఆ రెండు సినిమాల కన్నా చాలా షేడ్స్ ఉంటాయన్నారు. మాములుగా హీరోకి రెండు క్యారెక్టర్లు ఉంటే ఒకటి సాఫ్ట్, రెండోది రఫ్ అన్నట్లు ఉంటుంది కానీ ఈ సినిమాలో అలా ఉండదన్నారు. రామ్‌లో సరికొత్త యాంగిల్ కనబడుతుందని, అలాగే దర్శకుడిగా నాలోనూ కొత్త యాంగిల్ చూస్తారని పేర్కొన్నారు. హీరో బాగా డ్యాన్స్ చేస్తాడు కనుక ఓ మాస్ పాట పెట్టామని, ఇప్పటికే రెండు సినిమాలు చేశాం కనుక మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉందని వెల్లడించారు. ముగ్గురు హీరోయిన్లదీ మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుందన్నారు. నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, మాళవికా శర్మ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండటంతో పక్కా కమర్షియల్ చిత్రంలా ఉంటుందని, ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకునే విధంగా సినిమా నిర్మించామని తెలిపారు.