AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijaya Raghavan Teaser: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘విజయ రాఘవన్‌’.. అదర గొడుతున్న సినిమా టీజర్..

Vijaya Raghavan Teaser: విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమా ద్వారా తమిళ్, తెలుగు

Vijaya Raghavan Teaser: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘విజయ రాఘవన్‌’.. అదర గొడుతున్న సినిమా టీజర్..
uppula Raju
|

Updated on: Jan 03, 2021 | 8:36 AM

Share

Vijaya Raghavan Teaser: విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు విజయ్ ఆంటోని. బిచ్చగాడు సినిమా ద్వారా తమిళ్, తెలుగు ఇండస్ట్రీలను షేక్ చేశాడు. మదర్ సెంటిమెంట్‌తో పలువురి మనసులను కదిలించాడు. విజయ్ ఏ సినిమా చేపట్టినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటికే తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొందాడు.

ఆయన నటించిన తాజా చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఇందులో హీరోయిన్‌గా ఆత్మిక నటిస్తోంది. ఆనంద కృష్ణన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్‌ స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని యాక్షన్ సన్నివేశంలో కనిపిస్తారు. చిరుతపులి లాంటి కళ్లతో రౌడీ వైపు సీరియస్‌గా చూస్తున్న టీజర్ అభిమానులను ఎంతో అలరిస్తుంది. నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. విజయ్‌ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా: ఎన్‌.ఎస్‌. ఉదయ్‌ కుమార్, సహ నిర్మాతలు: కమల్‌ బోరా, లలితా ధనుంజయన్, బి. ప్రదీప్, పంకజ్‌ బోరా, ఎస్‌. విక్రమ్‌ కుమార్‌‌లు వ్యవహరించారు. కాగా ఈ సినిమా టీజర్ చూసిన అభిమానులు సినిమా కోసం ఆత్రుత కోసం ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతి వరకూ ఆ రాశుల వారికి పండుగే పండుగ..!
సంక్రాంతి వరకూ ఆ రాశుల వారికి పండుగే పండుగ..!
సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్
సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్
మొన్న రూ. 23 కోట్లకుపైగానే.. కట్‌చేస్తే.. నేడు రూ. 7 కోట్లకే
మొన్న రూ. 23 కోట్లకుపైగానే.. కట్‌చేస్తే.. నేడు రూ. 7 కోట్లకే
అటు చలి, ఇటు వర్షాలు.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..
అటు చలి, ఇటు వర్షాలు.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుంది..
వాట్సప్‌కు బిగ్ షాక్.. యూజర్ల డేటా షేర్ చేయాలంటే పర్మిషన్
వాట్సప్‌కు బిగ్ షాక్.. యూజర్ల డేటా షేర్ చేయాలంటే పర్మిషన్
రూ. 25.2 కోట్లకు అమ్ముడైనా.. గ్రీన్ చేతికి వచ్చేది రూ. 18 కోట్లే
రూ. 25.2 కోట్లకు అమ్ముడైనా.. గ్రీన్ చేతికి వచ్చేది రూ. 18 కోట్లే
దట్టమైన అడవిలో కనిపించినవి చూసి నివ్వెరపోయిన ఫారెస్ట్ సిబ్బంది..
దట్టమైన అడవిలో కనిపించినవి చూసి నివ్వెరపోయిన ఫారెస్ట్ సిబ్బంది..
Cameron Green IPL Auction 2026: మినీ ఆక్షన్ రికార్డులు బ్రేక్
Cameron Green IPL Auction 2026: మినీ ఆక్షన్ రికార్డులు బ్రేక్
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా.. ఇది ట్రై చేయండి
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా.. ఇది ట్రై చేయండి
అప్పుడే మొదలైన సంక్రాంతి సందడి.. కోళ్ల పందానికి ఈసారి కోట్లేనట!
అప్పుడే మొదలైన సంక్రాంతి సందడి.. కోళ్ల పందానికి ఈసారి కోట్లేనట!