AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Teja krack : ఎట్టకేలకు రవితేజ క్రాక్ సినిమా విడుదల.. చిత్రం గురించి దర్శకుడు మలినేని ఏం చెప్పారో తెలుసా..

Ravi Teja krack : రవితేజ, శృతి హాసన్‌ జంటగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్‌’ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం విడుదల కానున్న విషయం తెలిసిందే.

Ravi Teja  krack : ఎట్టకేలకు రవితేజ క్రాక్ సినిమా విడుదల.. చిత్రం గురించి దర్శకుడు మలినేని ఏం చెప్పారో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 09, 2021 | 9:58 PM

Share

Ravi Teja krack : రవితేజ, శృతి హాసన్‌ జంటగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్రాక్‌’ సినిమా సంక్రాంతి కానుకగా శనివారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే తీరా సినిమా విడుదల సమయానికి బ్రేక్‌ పడింది. క్రాక్‌ సినిమా మార్నింగ్‌ షో నిలిచిపోయింది. తమిళ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలే సినిమా నిలిచిపోవడానికి కారణంగా తెలుస్తోంది. అయితే నిర్మాత మధు ఇప్పటికే సదరు నిర్మాణ సంస్థతో చర్చలు జరిపి సినిమా విడుదలకు మార్గం సుగమంచేశారు. దీంతో క్రాక్‌ మూవీ విడుదలైంది. ఉదయం షో క్యాన్సిల్‌ కావడంతో ఫ్యాన్స్‌ నిరాశగా థియేటర్స్‌ ఉంచి వెనుతిరిగారు. కనీసం మ్యాట్నీ అయినా సినిమాను ఎంజాయ్‌ చేద్దామనుకుంటే జనవరి 9న సినిమా విడుదల కావడం లేదంటూ చెప్పారు. దీంతో అభిమానులతో పాటు ఆడియన్స్‌ నిరాశగా వెనుతిరిగారు. అయితే చిత్ర దర్శకుడు గోపిచంద్‌ మలినేని ట్విట్టర్‌ ద్వారా మూవీ విడుదలను ప్రకటించారు. సమస్యలన్నీ తీరాయని మూవీని ఈ రోజే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఫస్ట్‌ షో నుంచి సినిమా నడుస్తోంది. సినిమా సూపర్‌గా ఉందంటూ రవితేజ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో సినిమా కొత్త రికార్డులు తిరగరస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచానా వేస్తున్నాయి.

Raviteja Krack Movie: ఆగిపోయిన ‘క్రాక్‌’ మార్నింగ్‌ షో.. నిర్మాత ఆర్థిక లావాదేవీలే కారణం..