Heroine Rashikanna: షూటింగ్ పూర్తిచేసుకున్న ‘తుగ్లగ్ దర్బార్’ హీరోయిన్.. అద్భుతమైన ప్రయాణం ముగిసిందంటూ..

తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'తుగ్లగ్ దర్బార్'. ఈ సినిమాకు ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వం వహిస్తున్నారు.

Heroine Rashikanna: షూటింగ్ పూర్తిచేసుకున్న 'తుగ్లగ్ దర్బార్' హీరోయిన్.. అద్భుతమైన ప్రయాణం ముగిసిందంటూ..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2021 | 9:37 PM

తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తుగ్లగ్ దర్బార్’. ఈ సినిమాకు ఢిల్లీ ప్రసాద్ దీనదయాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు హీరోయిన్ రాశీఖన్నా, మంజిమా మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణం గురువారం పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్వట్టర్ ద్వారా ప్రకటించింది రాశీఖన్నా.

ప్రతి సినిమా చిత్రీకరణ కోసం చేసే ప్రయాణం ఓ జ్ఞాపకం అవుతుంది. ‘తుగ్లక్‌ దర్బార్‌’ చిత్రానికి చేసిన ప్రయాణం నాకెప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. విజయ్ సేతుపతి లాంటి ప్రతిభ ఉన్న నటుడితో నటించడం అనేది మంచి అనుభవం. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమా మీ అందరికి ముందుకు తొందరగా తీసుకురావాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Also Read:

Sharwanand: ‘శ్రీకారం’ నుంచి ‘సంక్రాంతి సందళ్లే’ ఫుల్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన శర్వానంద్ పాట..