నటుడిగా రాఘవేంద్రరావు.. జోడీ కట్టబోతున్న ఆ ముగ్గురు హీరోయిన్లు..!

టాలీవుడ్‌ టాప్ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ హీరోలను సైతం స్టార్లగా మార్చిన ఘనత ఆయనది.

నటుడిగా రాఘవేంద్రరావు.. జోడీ కట్టబోతున్న ఆ ముగ్గురు హీరోయిన్లు..!

Raghavendra Rao turns actor: టాలీవుడ్‌ టాప్ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ హీరోలను సైతం స్టార్లగా మార్చిన ఘనత ఆయనది. కుటుంబ కథ అయినా, మాస్ ఎంటర్‌టైనర్‌ అయినా, భక్తిరసం అయినా, సోషియో ఫాంటసీ అయినా.. కథ ఏదైనా సరే ఆయన డీల్ చేసే విధానం ఎవ్వరికైనా నచ్చుతుంది. అలాంటి దర్శకేంద్రుడు గురించి ఇప్పుడొక ఆసక్తికర ఫిలింనగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే రాఘవేంద్రరావు నటుడిగా మారనున్నారట.

45 ఏళ్ల కెరీర్‌లో ఇంతవరకు ఒక్కసారి కూడా కెమెరా అప్పియరెన్స్ ఇవ్వని రాఘవేంద్రరావు ఇప్పుడు ప్రధాన పాత్రలో నటించనున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోందట. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కథానుగుణంగా ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండగా.. ఆ పాత్రలకు గానూ రమ్యకృష్ణ, త్రిష, శ్రియ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురితో దర్శకేంద్రుడు పనిచేశారు. ఆయనపై ఉన్న గౌరవంతోనే వీరు ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే దర్శకేంద్రుడిని మొదటిసారిగా నటుడిగా చూసే అవకాశం సినీ ప్రేక్షకులకు దొరుకుతుంది.

ఇదిలా ఉంటే ఇటీవల రాఘవేంద్రరావు పెళ్లి సందడి సీక్వెల్‌ని ప్రకటించారు. ఆర్కా మీడియా వర్క్స్‌, ఆర్కే ఫిలిం అసోసియేట్స్‌ సంయుక్తంగా ఈ సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారు. ఇందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More:

గీతం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు

ఖరీదు కానుక ఇచ్చిన బంధువులు.. సంభ్రమాశ్చర్యాలకు గురైన కొత్త దంపతులు