AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie : విడుదలకు ముందే పెద్ది ప్రభంజనం.. వన్‌ మిలియన్‌ క్లబ్‌లో రామ్ చరణ్ సినిమా..

పెద్ది.. పాన్ ఇండియా లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా. రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా జూన్ 4 (2026) న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. 'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ మళ్లీ ఆ స్థాయి రగ్గడ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్న చిత్రం ఇదే. దీంతో భారీ హైప్ నెలకొంది.

Peddi Movie : విడుదలకు ముందే పెద్ది ప్రభంజనం.. వన్‌ మిలియన్‌ క్లబ్‌లో రామ్ చరణ్ సినిమా..
Peddi
Rajitha Chanti
|

Updated on: Jun 03, 2026 | 3:53 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న హైప్డ్ మూవీ ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే, ఓవర్సీస్‌లో ఒక రోజు ముందుగానే (జూన్ 3న) ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని రేంజ్‌లో జరుగుతున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో, ఈ సినిమా విడుదలకు ముందే అక్కడ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో ‘పెద్ది’ చిత్రం ప్రీ-సేల్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల (వన్‌ మిలియన్‌ క్లబ్‌) మైలురాయిని దాటి సంచలనం సృష్టించింది. కేవలం ప్రీమియర్ల ద్వారానే ఈ స్థాయి వసూళ్లను సాధించడం రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు నిదర్శనం. సంచలన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత చరణ్ నటించిన సినిమాల్లో, కేవలం ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ మార్క్‌ను అందుకున్న చిత్రంగా ‘పెద్ది’ నిలిచింది. దీంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు.

మరోవైపు, చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘పెద్ది’ పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా ఒదిగిపోయారని, ఈ క్యారెక్టర్ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుస్తీ (ఫైట్) సన్నివేశాల కోసం చరణ్ ఎంతో కష్టపడ్డారని, షూటింగ్‌లో దెబ్బలు తగిలినా లెక్కచేయకుండా నటించారని ప్రశంసించారు. ఒక దశలో చరణ్ కంటికి గాయం అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏమంటారోనని తాను చాలా భయపడ్డానని బుచ్చిబాబు గుర్తుచేసుకున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు తెలంగాణలో కూడా ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు, స్పెషల్ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Maheswari: ఆ హీరో అంటే క్రష్.. పిచ్చిగా ప్రేమించా.. చెల్లి అని మనసు ముక్కలు చేశాడు.. హీరోయిన్ మహేశ్వరి..

ఎక్కువమంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఒక్కో సీన్ ఊపిరి బిగపట్టి చూడాల్సిందే.. ఓటీటీలో రచ్చ చేస్తున్న మలయాళీ

Follow Us